A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జగన్ నవరత్నాలు..చంద్రబాబు భయపడుతున్నారా
Share |
February 19 2019, 8:04 am

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాగా కంగారు పడుతున్నట్లుగా ఉంది.నలభై ఏళ్ల అనుభవం నాది అని ప్రచారం చేసుకునే ఆయన ఇప్పుడు విపక్ష నేత, వైఎ్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ ను అనుసరిస్తున్నారు.ఒక వైపు జగన్ కు అనుభవం లేదని విమర్శించే చంద్రబాబు ఇప్పుడు ఆయన ఏది చెబితే ఈయన అది చేయడానికి సిద్దం అవుతున్నారంటేనే పరిస్థితి అర్దం చేసుకోవచ్చు. ఓటమి భయంతోనే చంద్రబాబు ఇలా చేస్తున్నారని అంటున్నారు. తాజాగా వృద్దాప్య పెన్షన్ లను రెండువేల రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. అది కొత్తగా ఆయన చెబుతున్నట్లు,దాంతో జనం అంతా ఆనందంతో చిందులు వేస్తున్నట్లు తెలుగదేశం మీడియా ప్రచారం ఆరంబించింది.విశేషం ఏమిటంటే 2017 జూలై ఎనిమిదో తేదీన గుంటూరు వద్ద జరిగిన పార్టీ ప్లీనరీలో నవరత్నాల పేరుతో ప్రకటించిన వరాలలో ఈ పెన్షన్ పెంపు అన్నది ఒక ముఖ్యమైన అంశం.వృద్దాప్య పెన్షన్ లను రెండువేల రూపాయలు చేస్తామని, ఎస్.సి,ఎస్టి, బిసి మహిళలకు పెన్షన్ అర్హత వయసు 45 ఏళ్లుగా చేస్తామని కూడా ఆయన చెప్పారు.అప్పట్లో ఈ నవరత్నాలను తెలుగుదేశం నేతలు కాని,చంద్రబాబు కాని ఎద్దేవ చేసేవారు.తీవ్రంగా విమర్శించేవారు. కాని శాసనసభ ఎన్నికలకు మూడు నెలల ముందు చంద్రబాబు పెన్షన్ లను పెంచుతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ నెల ఇవ్వవలసిన వెయ్యి రూపాయలు, వచ్చే నెల రెండువేల రూపాయలు కలపి పెన్షనర్లకు ఇవ్వడం ద్వారా మూడువేల రూపాయలు ఇచ్చారన్న భ్రమ కల్పించాలని ప్రయత్నిస్తున్నారు.రాజకీయాలలో ఇలాంటి ఎత్తుగడలు జరుగుతూనే ఉంటాయి.గతంలో ఒక మంచి అనుభవం ఉంది.1982లో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తాము అదికారంలోకి వస్తే కిలో బియ్యం రెండు రూపాయలకే ఇస్తామని ప్రచారం చేసేవారు.దానికి ప్రజలు బాగా ఆకర్షితులు అయ్యారు.ఆ విషయం గమనించిన అప్పటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి తాము ఒక పది పైసలు తక్కువకే అంటే కిలో 1.90 పైసలకే ఇస్తామని చెప్పి అమలు కూడా చేశారు. కాని జనం దానిని పట్టించుకోలేదు.ఎన్.టి.ఆర్.చెప్పిన విషయాన్ని నమ్మారు.దాంతో కాంగ్రెస్ ను ఓడించి ఎన్.టిఆర్ కు పట్టం కట్టారు. సరిగ్గా అదే రితిలో ఏడాదిన్నరకు పైగా వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదికారంలోకి వస్తే పెన్షన్ రెండువేలు చేస్తామని చెబుతూ వస్తున్నారు.ప్రజాసంకల్ప పాదయాత్రలో కూడా ఆయన వృద్దులకు ఈ భరోసా ఇస్తూ వెళ్లారు.ఇప్పుడు అచ్చం కోట్ల విజయభాస్కరరెడ్డి మాదిరి చంద్రబాబు కూడా పెన్షన్ హామీని ప్రకటించి అమలు చేస్తామని అన్నారు. అప్పట్లో కోట్ల కు ఎదురైన పరాజయం ఇప్పుడు చంద్రబాబుకు ఎలాంటి అనుభవం ఎదురు అవుతుందన్నది చూడాల్సి ఉంటుంది.అయితే జగన్ ఈ విషయంలో స్కోర్ చేశారన్నది అర్దం అవుతుంది.ఈ మాటే కాదు.పలు ఇతర అంశాలలో కూడా చంద్రబాబు జగన ను పాలో అయ్యారు. ప్రత్యేక హోదా అంశంపై జగన్ ఉద్యమాలు చేస్తున్నప్పుడు చంద్రబాబు దాని గురించి ఎద్దేవ చేసేవారు.హోదాతో ఏమి వస్తుంది?హోదా పొందిన రాష్ట్రాలు ఏమి బాగుపడ్డాయి?తాను తెలివైన వాడిని కనుక,సీనియర్ ను కనుక ప్యాకేజీకి ఒప్పుకున్నానని చంద్రబాబే చెప్పుకున్నారు.అంతేకాదు ప్రత్యేక హోదా అని విద్యార్దులు అడిగితే జైలులో పెడతానని హెచ్చరించేవారు.అలాంటిది బిజెపితో చెడాక అసలు ప్రత్యేక హోదా కోసం అడుగుతున్నది తానేనని,జగన్ వద్దంటున్నారంటున్నట్లు చిత్రమైన ప్రచారం చేస్తున్నారు.దర్మపోరాట దీక్షలు అని ప్రభుత్వ ధనం కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ ప్రచారం పర్వం సాగిస్తున్నారు.అంతేకాదు..రెండు సార్లు ఎమ్.పిగా, ఒక పార్టీని స్థాపించుకుని సొంతంగా అరవైఏడు మంది ఎమ్మెల్యేలను గెలిపించుకుని ప్రతిపక్ష నేతగా పదవి నిర్వహిస్తుంటే,ఆయనకు సర్పంచ్ అనుభవం కూడా లేదని చంద్రబాబు ప్రచారం చేస్తారు.అదే సమయంలో తన కుమారుడు లోకేష్ కు నిజంగానే సర్పంచ్ అనుభవం లేకోపయినా,ఎమ్మెల్యే కాకపోయినా మంత్రిని చేసుకున్నారు.చంద్రబాబులో ఉన్న గొప్పదనం ఏమిటంటే తను ఎన్ని అబద్దాలు ఆడినా,ఎలా మాట్లాడినా జనం ఏమైనా అనుకుంటారా అన్నది ఫీల్ కారు.ఏది ఏమైనా చంద్రబాబుపై నైతికంగా జగన్ పెన్షన్ ల విషయంలో విజయం సాదించినట్లే.

tags : ap,jagan, chadnrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info