A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
భార్యాభర్తలు ఇద్దరూ లోక్ సభకు పోటీ
Share |
February 19 2019, 8:09 am

లోక్ సభ ఎన్నికల బరిలోకి ఉత్తర ప్రదేశ్ మాజీముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ఆయన భార్య ,ప్రస్తుతం ఎమ్.పిగా ఉన్న డింపుల్ ఇద్దరూ దిగవచ్చు. డింపుల్‌.. కన్నౌజ్‌ స్థానం నుంచి మళ్లీ బరిలోకి దిగనున్నట్లు భావిస్తున్నారు. తమ పార్టీ బలంగా ఉన్న మరో లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ పోటీ చేయనున్నారని ఆ పార్టీ నేత ఒకరు తెలిపారు. మొదట, ఈ సారి డింపుల్‌ని కన్నౌజ్‌ నుంచి పోటీ నుంచి తప్పించి, తమకు పట్టున్న ఆ స్థానం నుంచి అఖిలేశ్‌ను పోటీ చేయించాలని ఆ పార్టీ భావించింది. అయితే, బీఎస్పీతో పొత్తు కుదిరిన తరువాత గెలుపుపై ధీమా పెరగడంతో వారిద్దరూ పోటీ చేయాలని భావిస్తున్నారు. ‌

tags : up, akhilesh, wife,contest

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info