A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ను ఎపికి బాబు ఎందుకు పిలిచారు
Share |
August 26 2019, 3:09 pm

సీట్ల కోసం పాకులాడే రకం తాము కాదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అదికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబులా మేము ఎవరికి కొమ్ము కాయం, లాలూచీలు ఉండవు, ఏ పార్టీతో పొత్తులుండవు. చంద్రబాబు కేసీఆర్‌ను అమరావతికి ఎందుకు పిలిచారు? కేసీఆర్‌ నిర్వహించిన యాగానికి చంద్రబాబు ఎందుకు వెళ్లారు?. మేము మీలా సీట్ల కోసం పాకులాడే రకం కాదు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. కేటీఆర్‌ మాతో ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపితే టీడీపీ నేతలు కుక్కల్లా మొరుగుతున్నారు. హరికృష్ణ మృతదేహం పక్కన పెట్టుకుని రాజకీయ ప్రయోజనాల కోసం టీఆర్‌ఎస్‌తో చంద్రబాబు చర్చలు జరిపింది నిజమా? కాదా?. టీఆర్‌ఎస్‌ ఛీ అన్న తర్వాత కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తుపెట్టుకున్నారు.దివంగత నేత వైఎస్సార్‌ కుమార్తె షర్మిల వ్యక్తిత్వం దెబ్బతీయాలని టీడీపీ చేస్తున్న ప్రయత్నంపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. షర్మిలపై ఇలాంటి దుష్ప్రచారాలు రావటం బాధ కలిగిస్తోంది. చంద్రబాబు తన రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వం దెబ్బతీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. చంద్రబాబుది నీచమైన స్వభావం.’అంటూ అంబటి రాంబాబు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు.

tags : ambati, ap, babu

Latest News
*4 రాజధానులా..క్లారిటీ ఇవ్వండి -టిడిపి
*పోలవరం పనులు రాష్ట్రమే కొనసాగిస్తుంది
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
*యరపతినేని అక్రమ మైనింగ్ పై సిబిఐ
*లోకేష్,బ్రాహ్మణిల పెళ్లిరోజు-ట్వీట్ ఆసక్తిగా ఉంది.
*మాజీ ప్రదాని మన్మోహన్ సింగ్ భద్రత తొలగింపు
*ఈ దుర్మార్గాల నుంచి జగన్ కాపుకాసుకోవల్సిందే
*కెటిఆర్ కు మంత్రి పదవి-పెరుగుతున్న స్వరం
*సిబిఐ విచారణకు మాజీ సిఎమ్. వెళ్లాల్సిందేనా
*ఇక వర్షం కోసం ఎదురు చూడనక్కర్లేదు
*బిజెపిపై తీవ్ర వ్యాఖ్య
*పోలవరం కేంద్రానికి -టిడిపి మీడియా
*టిజి వెంకటేష్ వాదన ఏమిటంటే..
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info