A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఫెడరల్ ప్రంట్ తరపున ప్రచారం -విజయసాయి
Share |
April 20 2019, 8:17 pm

ఎపిలో టిఆర్ఎస్ పోటీ చేయదని, అలాగే ఎవరికి మద్దతు ఇవ్వదని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పి విజయసాయిరెడ్డి చెప్పారు.అయితే ఫెడరల్ ప్రంట్ లోని భాగస్వాములకు మద్దతు ప్రంట్ ప్రచారం చేస్తుందని ఆయన అన్నారు.ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగా టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ కావడం ప్రారంభం మాత్రమేనని తెలిపారు. .. వైఎస్‌ జగన్‌, కేటీఆర్‌లు ఫెడరల్‌ ఫ్రంట్‌ గురించి చర్చలు జరిపారన్నారు. త్వరలో కేసీఆరే స్వయంగా వైఎస్‌ జగన్‌తో చర్చలు జరుపుతారని తెలిపారు.రాష్ట్రాల హక్కు కోసం కేంద్రంతో పోరాడాటానికి ఒక వేదికగా ఫెడరల్‌ ఫ్రంట్‌ నిలుస్తుందని, ఇది ఒక్క టీఆర్‌ఎస్‌, వైఎస్సార్‌సీపీది మాత్రమే కాదన్నారు. వివిధ రాష్ట్రాలకు చెందిన రాజకీయ పార్టీలు ఇందులో భాగమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో టీఆర్‌ఎస్‌ పోటీ చేయదని, అభ్యర్థులను నిలపదన్నారు. ఫెడరల్‌ ఫ్రంట్‌లో ఏ ప్రాంతీయ పార్టీలైతే భాగమవుతాయో.. వారికి మద్దతుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రచారం నిర్వహిస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చేవారికే వైస్సార్‌సీపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

tags : vijayasai, front

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info