A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మరో సారి మోడీ-బిజెపి నినాదం
Share |
April 20 2019, 8:21 pm

మరోసారి మోదీ అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని జాతీయ కౌన్సిల్ సమావేశం జరిగిందని తెలంగాణ అద్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. జాతీయ కార్యవర్గ సమావేశాలు విజయవంతంగా సాగాయని ఆయన చెప్పారు. ఇద్దరు చంద్రులు ఫ్రంట్ల కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, ఇద్దరి ప్రయత్నాలు విఫలం కావడం తథ్యమన్నారు.
ఎవరైనా ఫ్రంట్ పెట్టుకోవచ్చు, టెంట్లు వేసుకోవచ్చని, దాని వల్ల ఎవరికీ ఇబ్బంది లేదని లక్ష్మణ్‌ తెలిపారు. ఈ ఫ్రంట్లు టెంట్ల వల్ల ప్రయోజనం లేదన్నారు. గతంలో ఇలాంటి ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. ఇదంతా కుటుంబపార్టీలన్ని కలిసి తమ ఉనికి చాటుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు మాత్రమేనన్నారు. జాతీయ పార్టీ లేని కూటములు ఎన్నికట్టినా అది విఫలమవుతుందన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణప్రజలు సైతం మోదీకే పట్టం కట్టాలని ఆసక్తి చూపుతున్నారని, పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటు వేసే పరిస్థితి లేదని ఆయన అబిప్రాయపడ్డారు.

tags : lakshman, modi

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info