A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిఆర్ఎస్ లోకి కెసిఆర్ ప్రత్యర్ధి
Share |
April 20 2019, 7:57 pm

తెలంగాణ కాంగ్రెస్ కు ఒక విధంగా ఇబ్బంది కలిగించే అంశమే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి కెసిఆర్ పై కాంగ్రెస్ తరపున పోటీచేసిన ఒంటేరు ప్రతాపరెడ్డి టిఆర్ఎస్ లో చేరుతున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. గత రెండుసార్లుగా ఆయన గజ్వేల్ లో కెసిఆర్ పైనే తలపడ్డారు. ఈసారి కాంగ్రెస్ పక్షాన పోటీ చేయగా అంతకుముందు టిడిపి తరపున బరిలో నిలిచారు. టిడిపి రైతు అద్యక్షుడు గా పనిచేసిన ఒంటేరు ఓటు కు నోటు కేసు పరిణామల తర్వాత ఎన్నికల కు ముందు టిడిపి కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల సమయంలో కెసిఆర్ పైన ,టిఆర్ఎస్ పైన తీవ్ర విమర్శలు చేసిన ప్రతాపరెడ్డి ఇప్పుడు టిఆర్ఎస్ లో చేరుతుండడం విశేషః. శుక్రవారం సాయంత్రం కెసిఆర్ సమక్షంలో ఒంటేరు టిఆర్ఎస్ లో చేరునున్నారు.

tags : trs, voteru

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info