A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ కు 36 వంటలతో బాబు విందు ఇచ్చారే
Share |
April 20 2019, 7:58 pm

టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ తో తమ పార్టీ అదినేత జగన్ మాట్లాడడమే తప్పు అని దుష్ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అమరావతికి పిలిచి ముప్పైఆరు వంటలతో విందు ఎందుకు ఇచ్చారని ,అది ఆంద్రాకు ద్రోహం కాదా అని వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా ప్రశ్నించారు. అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు పిలవడమే కాకుండా రాయిమీద ఆయన పేరు చెక్కించారు. టీడీపీ నేతలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు.. గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్‌ మెప్పు కోసం చంద్రబాబు 36 వంటకాలు చేయించి దగ్గరుండి వడ్డించారు. అప్పుడేమైంది మీ బుద్ధి? కేసీఆర్‌కు దేవినేని ఉమా విజయవాడలో సన్మానం చేశారు. పరిటాల సునీత కొడుకు పెళ్లిలో కేసీఆర్‌ మెప్పు కోసం టీడీపీ నేతలు చేసిన ప్రదక్షిణలను అందరూ చూశారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని వేషాలైనా వేస్తారని రోజా మండిపడ్డారు.

tags : roja, chadnrababu,kcr, dinner

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info