A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
పెడరల్ ప్రంట్ పనే చర్చ-పొత్తు ప్రసక్తి లేదు
Share |
August 21 2019, 7:17 am

టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్ కు, వైఎస్ ఆర్ కాంగ్రస్ అదినేత జగన్ కుమద్య జరిగింది పెడరల్ ప్రంట్ గురించిన చర్చే తప్ప, పొత్తుల గురించి కాదని సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పస్టం చేశారు.తెలుగుదేశం పార్టీ నేతలు అసత్యాలు ప్రచారం చేసి, ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆయన అన్నారు.గతంలో కెసిఆర్ తో పొత్తు కు ప్రయత్నించిన చంద్రబాబు ఇప్పుడు వారితో మాట్లాడడమే నేరం అన్ననట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని అవమానాలైనా భరిస్తామని.. ఎంత దూరమైనా వెళ్తామని తమ పార్టీ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఒకవేళ ఏపీకి తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్యాయం చేసుంటే.. ఆ రాష్ట్ర ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌తో పొత్తు కోసం టీడీపీ ఎందుకు ప్రయత్నించిందని ప్రశ్నించారు.ఒడిషా, కర్ణాటక, పశ్చిమబెంగాల్‌ సీఎంలను ఫెడరల్‌ ఫ్రంట్‌ కోసం కేసీఆర్‌ కలిశారని, ఈ నేపథ్యంలోనే వైఎస్‌ జగన్‌ను టీఆర్‌ఎస్‌ నేతలు కలిశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై టీడీపీ నేతలు ప్రజల్లో అపోహలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని గతంలోనే తమ అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో రాజధాని కొనసాగే అవకాశం ఉన్నా ఎందుకు ముందుగానే వచ్చారని చంద్రబాబును ప్రశ్నించారు.

tags : botsa, federal front

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info