A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారు
Share |
August 26 2019, 2:50 pm

తెలుగుదేశం పార్టీ ఎపి నేతలు తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని నల్గొండ ఎమ్.పి, రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. టిఆర్ఎస్ వర్కింగ్ అద్యక్షుడు కెటిఆర్, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ లు భేటీ అవడంపై తెలుగుదేశం నేతలు చేస్తున్ వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. జాతీయ స్థాయిలో ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటులో భాగంగానే టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారని ఆయన టీఆర్‌ఎస్‌-వైఎస్సార్‌సీపీ పొత్తు అంటూ పిచ్చిగా మాట్లాడుతున్నారని నిప్పులుచెరిగారు. జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూడలేక టీఆర్‌ఎస్‌తో పొత్తు అంటూ టీడీపీ విషప్రచారం చేస్తుందని గుత్తా ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో 4సంవత్సరాలు సంసారం చేసి ఇప్పుడు టీడీపీ నేతలు శ్రీరంగ నీతులు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో టీడీపీని కాంగ్రెస్‌ని ఏవిధంగా తిరస్కరించారో, ఆంధ్రాలో కూడా టీడీపీని కాంగ్రెస్‌ని ప్రజలు తిరస్కరించడం ఖాయమని సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

tags : gutta, tdp

Latest News
*చిదంబరం కు బెయిల్ నిరాకరణ
*ఎపి గవర్నర్ భార్యకు మోకాళ్ల ఆపరేషన్
*42 రోజుల తర్వాత ప్రత్యక్షమైన ప్రతిపక్ష నేత
*జనతా -జనార్దన్ తెలంగాణ ప్రభుత్వ కొత్త యాప్
*అమరావతే టిడిపిని ముంచింది
*పోలవరం నిర్మాణంలో మార్పులు లేవు-జివిఎల్
*కాంగ్రెస్ ఎమ్.పి పాదయాత్రకు అనుమతి నో
*రాజదాని ఏ ఒక్క సామాజికవర్గానికో కాదు
*కెసిఆర్ తో చేతులు కాల్చుకోవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info