A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
న్యాయ వ్యవస్థలో మళ్లీ లొల్లి
Share |
April 20 2019, 8:02 pm

న్యాయ వ్యవస్థలో మరోసారి లొల్లి ఆరంభం అయింది. జూనియర్ లకు ప్రమోషన్ ఇచ్చారంటూ సుప్రింకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కౌల్ రాసిన లేఖ కలకలం రేపుతోంది.హైకోర్టు జడ్జి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాను కేంద్రప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారని మీడియా కదనం. సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సుల మేరకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. రాజస్థాన్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రదీప్‌ నంద్రజోగ్‌, దిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాజేంద్ర మేనన్‌లు సీనియర్లు అయినప్పటికీ, వారిని కాదని జస్టిస్‌ ఖన్నాను నియమించారంటూ కౌల్‌ కొలీజియం సభ్యులైన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎ.కె.సిక్రి, జస్టిస్‌ ఎస్‌.ఎ.బోబ్డే, జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ అరుణ్‌ మిశ్రలకు నోట్‌ రాశారు. సీనియర్లయిన ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించకపోతే తప్పుడు సంకేతాలు వెళ్తాయని ఆయన అందులో పేర్కొన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అఖిల భారతస్థాయి సీనియార్టీ జాబితాలో జస్టిస్‌ ఖన్నా 33వ స్థానంలో ఉన్నారు. సీనియార్టీని పట్టించుకోవడం లేదంటూ ప్రధాన న్యాయమూర్తి కాకముందు విలేకరుల సమావేశం పెట్టి విమర్శలు చేసిన జస్టిస్‌ గొగొయి ఇప్పుడు ఇలా చేయడం ఏమిటని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌.ఎం.లోధా వ్యాఖ్యానించారు.

tags : supreme court, judiciary

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info