A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
స్రైవేటు విద్యా సంస్థలలో రిజర్వేషన్ లు
Share |
February 19 2019, 8:59 am

ప్రైవేటు సంస్థలలో కూడా రిజర్వేషన్ లు ఉండాలని కమ్యూనిస్టులు డిమాండ్ చేస్తుంటారు.ప్రస్తుతం బిజెపి ప్రైవేటు విద్యాసంస్థలలో రిజర్వేషన్ లు అమలు చేయడానికి సిద్దం అవుతోంది. ఇప్పటివరకు రిజర్వేషన్లు అమలు కాని ప్రైవేటు విద్యాసంస్థల్లోనూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి వాటిని వర్తింపజేయనున్నట్లు కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లతోపాటు కొత్తగా తీసుకొచ్చిన పేదల కోటా 10 శాతాన్ని కూడా వాటిలో అమలు చేస్తామని తెలిపారు. మొత్తం 40 వేల కళాశాలలు, 900 విశ్వవిద్యాలయాల్లో రానున్న విద్యాసంవత్సరం నుంచే ఈ 10 శాతం కోటాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు చెప్పారు. పాత రిజర్వేషన్లకు అదనంగానే ఈ పదిశాతం కోటా ఉంటుందని స్పష్టం చేశారు. కొత్త రిజర్వేషన్ల విధానం అమలు కోసం అన్ని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో 25 శాతం సీట్లు పెంచుతామని ఆయన వివరించారు.

tags : prakash javadekar, reservations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info