A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కర్నాటక ప్రభుత్వానికి గండం?
Share |
April 20 2019, 8:00 pm

కర్నాటకలో ప్రభుత్వానికి గండం ఏర్పడినట్లే ఉంది.కుమారస్వామి ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ఇద్దరు స్వతంత్ర అభ్యర్దులు ప్రకటించారు. స్వతం‍త్ర ఎమ్మెల్యేలు హెచ్‌ నగేష్‌, ఆర్‌ శంకర్‌లు జేడీఎస్‌-కాంగ్రెస్‌ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించినట్టు తెలిపారు. ప్రభుత్వ మార్పును కోరుకుంటున్నామని వారు చెప్పారు.
కుమారస్వామి నేతృత్వంలోని జేడీఎస్‌-కాంగ్రెస్‌ సర్కార్‌ సుపరిపాలన, నిలకడైన ప్రభుత్వాన్ని అందించడంలో ఘోరంగా విఫలమైందని మరో ఎమ్మెల్యే ఆర్‌ నగేష్‌ విమర్శించారు. సంకీర్ణ భాగస్వామ్య పక్షాల మధ్య ఎలాంటి అవగాహన, సమన్వయం లేదని అన్నారు. సుస్ధిర ప్రభుత్వం ఏర్పడే దిశగా తాను బీజేపీతో జట్టుకట్టాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.అయతే వారిద్దరు మద్దతు ఉపసంహరించినా తమ ప్రభుత్వానికి ప్రమాదం లేదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.కాంగ్రెస్,జెడిఎస్ ఎమ్మెల్యేలు కొందరిని బిజెపి ఆకర్షిస్తోందని ఆరోపణలు వస్తుండగా, బిజెపి ఎమ్మెల్యేలను లాగడానికి కాంగ్రెస్,జెడిఎస్ లు ప్రయత్నిస్తున్నాయని మరో వైపు ఆరోపణలు వచ్చాయి. బిజెపి ఎమ్మెల్యేలను ఇప్పటికే క్యాంపునకు తరలించారు.ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత కొద్ది రోజులుగా పార్టీకి అందుబాటులో లేకపోవడంతో కలకలం ఏర్పడింది.

tags : karnataka, govt, crisis

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info