A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్ .సినిమా కు పేలవంగా వసూళ్లు
Share |
August 21 2019, 6:23 am

మామూలుగా అయితే ఎన్.టి.ఆర్.బయోపిక్ సినిమా బాగా ఆడాలి. రాజకీయ ప్రయోజన ఉద్దేశంతో తీసారో,లేక మరే కారణంతో తీశారో కాని ఎన్.టిఆర్ కుమారుడు బాలకృష్ణ తీసిన ఈ సినిమా పలు ప్రాంతాలలో భారీ నష్టాలకు గురైందట.డెక్కన్ క్రానికల్ పత్రికలో దీనిపై ఒక కదనం వచ్చింది.సినిమాకు సంబందించి రివ్యూలు బాగానే వచ్చినా,కలెక్షన్ లు మాత్రం బాగా పేలవంగా ఉన్నాయని ఆ కదనం చెబుతోంది.అంతేకాక పలు ప్రాంతాలలో ఈ సినిమా నష్టాలను రికార్డు చేసిందట.బాలకృస్ణకు ఒక సెంటిమెంట్ గతంలో నుంచి ఉందట.అసలే మూడ నమ్మకాలు అదికంగా ఉండే బాలకృష్ణకు ఈ సినిమాలో అలాంటి అనుభవమే ఎదురైందని కదనం ఇచ్చారు.గతంలో ఆయన నిర్మాతగా మారాలని అనుకున్నప్పుడల్లా విఘాతం కలిగిందట.ఏది ఏమైనా సావిత్రి బయోపిక్ మహానటి సినిమా బాగా ఆడితే, ఎన్.టి.ఆర్.బయోపిక్ పెయిల్ అవడం చిత్రమే.బహుశా ఎపి రాజకీయాల ప్రబావం కూడా ఉందేమో!అంతేకాక బాలకృష్ణ తండ్రి పాత్ర పోషించడం ఏమైనా యాంటి సెంటిమెంట్ అయిందా?ఈ దశలో ఎన్.టి.ఆర్.బయోపిక్ రెండో పార్ట్ ఏలా ఉంటుందా అన్న ఉత్కంఠ ఏర్పడింది.

tags : ntr, biopic, collections, poor

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info