A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అన్నాడి.ఎమ్.కెతో బిజెపి పొత్తు?
Share |
August 21 2019, 7:23 am

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లుగా ఉంది. అన్నా డి.ఎమ్.కె. ,బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు కూడా ఈ ఊహాగానాలకు ఆస్కారం ఇస్తున్నాయి.రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు' అని ఆయన అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తగిన పొత్తులతో ముందుకు వెళ్తామని, ప్రజాభీష్టం మేరకే 'మెగా అలయెన్స్' ఉంటుందని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికల నుంచి స్థానిక సంస్థల ఎన్నికల వరకూ ఏ ఎన్నికలు వచ్చినా అన్నాడీఎంకే సిద్ధంగా ఉందని అన్నారు. మరో వైపు డీఎంకే-కాంగ్రెస్ కూటమిని మినహాయించి ఏ పార్టీతోనైనా పొత్తుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు తమిళిసై సౌందరాజన్ తెలిపారు. కాంగ్రెస్ ,డిఎమ్.కె.లను ఓడించడానికి ఈ పొత్తు అవసరం కావచ్చన్నది ఒక అబిప్రాయంగా ఉంది.

tags : tamilnadu, aiadmk, bjp, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info