A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కెసిఆర్ ,జగన్ కలిసి ప్రచారం చేయాలట
Share |
April 20 2019, 8:02 pm

తెలంగాణ ఎమ్మెల్యే,మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు తెలుగుదేశం పార్టీ కౌంటర్ ఇచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేయాలని టిడిపి ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. తెలుగు జాతి ఎవరికి గిఫ్ట్‌ ఇస్తుందో.. ఎవరికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తుందో అప్పు డు తెలుస్తుందని ఆయన అన్నారు.ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కంటే నిధులు ఇవ్వటంలో, సేవలు అందించటంలో ఏ ప్రభుత్వమైనా ముందు ఉందా? ఉంటే సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. ఏదో వాళ్లని వాళ్లని రెచ్చగొట్టి ఉడత ఊపులు ఊపితే చింత కాయలు రాలవన్నారు. ఉడతలు వచ్చి చెట్లు మారినట్లు చెప్పటం సమంజం కాదని అర్జునుడు అన్నారు. డబ్బు, మద్యం కారణంగానే తెలంగాణలో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని బచ్చుల ఆరోపించారు.

మరి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తో కలిసి పొత్తు పెట్టుకోవాలని, కలిసి ప్రచారం చేయాలని అనుకున్నారు కదా?.అప్పుడు ఇబ్బంది ఉండదా?

tags : tdp, kcr, jagan

Latest News
*చంద్రబాబు ఇవ్వాళ కూడా ఈ ట్వీట్ ఇవ్వాలా
*లక్ష్మీనారాయణకు మళ్లీ విజయసాయి కౌంటర్
*చంద్రబాబుకు ఈనాడు పొగడ్తల జల్లు
*లక్ష్మీనారాయణ వ్యాఖ్య- నిజంగా దర్మంగా చేశారా
*కర్నాటక ప్రజల చెవిలో చంద్రబా బు పూలు
*మోడీలో ఆ లక్షణాలు లేవంటున్న విజయశాంతి
*ముఖ్యమంత్రి పగటి కలలు కంటున్నారు
*ఈ ప్రభుత్వమే పోతుంది.. భయపడవద్దు
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info