A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
కొత్త మిత్రుల కోసం బిజెపి ప్రయత్నాలు
Share |
January 18 2019, 12:36 pm

తమిళనాడులో పొత్తుల కోసం బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.తమిళనాడులో ఇతర పార్టీలతో పొత్తులకు ద్వారాలు తెరిచే ఉంచామని ప్రదానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. పాత మిత్రులను తాము గుర్తు ఉంచుకున్నామని ఆయన అన్నారు.పార్టీ కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ‘ప్రాంతీయ పార్టీలకు, ఆకాంక్షలకు అటల్‌జీ ప్రాధాన్యత ఇచ్చారు. ఆయన చూపిన మార్గంలోనే బీజేపీ వెళ్తోంది. వాజ్‌పేయి ఏం చేశారో దానికి పూర్తి విరుద్ధంగా కాంగ్రెస్‌ చేసింది. అధికారంలో ఉండేందుకు తమకు ఒక్కరికే హక్కు ఉందని ఆ పార్టీ భావించింది’ అని విమర్శించారు.తమిళనాడులో బీజేపీ అన్నాడీఎంకే, డీఎంకే లేదా రజినీకాంత్‌ పెట్టే పార్టీల్లో దేనితో పొత్తు పెట్టుకుంటుందని ఓ కార్యకర్త అడగ్గా, ‘వాజ్‌పేయి 1990ల్లో విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపారు.ఇప్పుడు కూడా మిత్రుల కోసం బీజేపీ ద్వారాలు ఎప్పుడూ తెరిచే ఉంటాయి’ అని జవాబు ఇచ్చారు.

tags : modi, bjp, friends

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info