A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రీజినల్ రింగ్ రోడ్డు-తెలంగాణలో డిపిఆర్
Share |
March 23 2019, 9:46 am

తెలంగాణలో రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు నివేదిక తయారీ పై ముఖ్యమంత్రి కెసిఆర్ వాకబ్ చేశారు. వీలైనంత త్వరగా డీపీఆర్‌ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రాజధానిపై ట్రాఫిక్‌ కష్టాలను తీర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్‌ ఆర్‌ నిర్మించాలని తలపెట్టింది. అందుకే, సీఎం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటులో కేంద్ర సహాయ మంత్రి మాండవీయ రీజినల్‌ రింగ్‌రోడ్డులోని రెండు రోడ్ల నిర్మాణానికి అంగీకారాన్ని వెల్లడించారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చు భరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ కూడా డీపీఆర్‌ పనులపై ఆరాతీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తం 334 కిలోమీటర్ల దూరం రెండు దశల్లో సంగారెడ్డి–నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్‌–జగ్‌దేవ్‌పూర్‌– భువనగిరి–చౌటుప్పల్‌ (దాదాపు 154 కి.మీ), చౌటుప్పల్‌–షాద్‌నగర్‌–కంది (దాదాపు 180 కి.మీ) రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌ప్రెస్‌ హైవేగా నిర్మించనున్నారు.

tags : regional ring roads

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info