A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబుకే అబద్ధాల ‘అస్కార్ ఆవార్డు’ !-వాసిరెడ్డి స్టోరీ
Share |
March 22 2019, 1:42 pm

చంద్రబాబుకే అబద్ధాల ‘అస్కార్ ఆవార్డు’ !అంటూ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలుగు గేట్ వే లో రాసిన కదనం ఇది.

అబద్ధాలకే ‘ఆస్కార్ అవార్డు’ ఉంటే దేశంలోనే ఏకగ్రీవంగా ఈ అవార్డు దక్కించుకునే వ్యక్తి టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే. ఎందుకంటే ఏ విషయంలో అయినా ఆయన అంత అలవోకగా అబద్ధాలు చెప్పగలరు. అనుభవం ఉన్న నేత అని ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని రాష్ట్ర విభజన తర్వాత గెలిపిస్తే ఇప్పుడు ఏపీ ప్రజలను చంద్రబాబు వంచిస్తున్న తీరు మామూలుగా లేదు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ‘ఏపీ రాజధానిని సింగపూర్ సంస్థలే నిర్మిస్తాయని పదే పదే ప్రకటించారు. దేశీయ సంస్థలు మురికివాడలు కట్టగలవు. కానీ ప్రపంచ స్థాయి రాజధాని కావాలంటే సింగపూర్ సంస్థలే కట్టాలంటూ ‘వీడియోల’ సాక్షిగా చెప్పారు. కానీ ఎంచక్కా రాజధాని నిర్మాణ పనులను దేశీయ కంపెనీలకు అప్పగించేసి..ఇప్పుడు మాత్రం చంద్రబాబు కొత్త మాట ఎత్తుకున్నారు. అదేంటి? అంటే…‘రాజధాని అమరావతిని సింగపూర్ తరహాలో అభివృద్ధి చేస్తానని ఎన్నికల్లో ఇఛ్చిన హామీని నిలబెట్టుకుంటున్నాను’ అని.

ప్రభుత్వంలోకి వచ్చాక సింగపూర్ కంపెనీలు రాజధాని కడతాయని..తన ఇమేజ్ చూసే రాష్ట్రానికి ఇలాంటి కంపెనీలు వచ్చాయని ఊదరగొట్టారు. ఇప్పుడు సింగపూర్ కంపెనీలను పక్కన పెట్టి సింగపూర్ లా అభివృద్ధి చేస్తానని చెప్పినట్లు మాట మార్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్విస్ ఛాలెంజ్ మోడల్ లో సింగపూర్ సంస్థలకు వేల కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి రెడీ అయినా..ఆయన మళ్ళీ అధికారంలోకి వస్తారో రారో అనే అనుమానంతో ఇప్పటి వరకూ ఆ కంపెనీలు అసలు పనులే మొదలుపెట్టలేదు. పైగా ఇప్పుడు ఆ కంపెనీలతో కలసి తాము కట్టబోయే భవనాలు ఎలా ఉండబోతున్నాయో ‘సినిమా’ చూపించేందుకు చంద్రబాబు రెడీ అయిపోయారు. ఈ సినిమా గ్యాలరీని చూపించి..తాను అధికారంలోకి వస్తేనే ఇది పూర్తవుతుందని..లేకపోతే ఆగిపోతుందని ప్రజలను నమ్మించేందుకు రెడీ అయిపోయారు.
కానీ రాజధాని సింగపూర్ కంపెనీలతో కట్టిస్తానన్నారు కదా?.. ఇదే రాజధాని అంటూ బొమ్మలు చూపించారు కదా?.అవి ఎక్కడ అని చంద్రబాబును అడిగేవారు ఎవరూ లేరు?. అందుకే ఆయన అలా అబద్ధాలు హాయిగా చెప్పుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాస్తవానికి సింగపూర్ కంపెనీలు కట్టేది ప్రైవేట్ వ్యాపార భవనాలు. అవి అద్దెకు ఇచ్చుకునేందుకు..అమ్ముకునేందుకే. అయినా సరే ఆ సంస్థలకు రైతుల దగ్గర నుంచి సేకరించిన భూమి ఇవ్వటంతోపాటు…వేల కోట్ల రూపాయల ప్రజల సొమ్ముతో మౌలికసదుపాయాలు కల్పించనున్నారు. అయినా సరే ఇప్పటివరకూ అడుగు ముందుపడలేదు. కానీ ఇప్పుడు కొత్త సినిమా కథ చూపించటానికి రెడీ అయ్యారు.

tags : vasireddy babu

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info