A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబుపై కొడాలి నాని ఫైర్
Share |
June 25 2019, 12:54 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై గుడివాడ వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కొడాలి నాని పెద్ద ఎత్తున ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనకు టైమ్ అయిపోయిందని ఆయన మండిపడ్డారు. ‘పవన్ కల్యాణ్ వచ్చి నాతో కలవాలని చంద్రబాబు అంటారు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా‘పవన్ కల్యాణ్ వచ్చి నాతో కలవాలని చంద్రబాబు అంటారు. అసలు మీకు సిగ్గు, శరం ఉందా? మిమ్మల్ని రోజూ తిడుతున్న వ్యక్తి వచ్చి మధ్దతు ఇవ్వాలని కోరుతున్నావు. కాంగ్రెస్ వచ్చి నాతో కలవాలని అంటావు. అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతకైనా దిగజారుతారు. జగన్‌కు దమ్ము, ధైర్యం ఉంది కాబట్టి సోలోగా పోటి చేస్తానని ప్రకటించారు. అసెంబ్లీకి వెళ్లకుండా జీతాలు తీసుకుంటున్నారని మమ్మల్ని విమర్శిస్తున్నారు. మరి మీరు 365 రోజులు అసెంబ్లీలోనే ఉండి జీతాలు తీసుకుంటున్నారా? మీరు ఎన్ని రోజులు అసెంబ్లీకి వెళ్తున్నారు. అసెంబ్లీకి వెళ్లని మిగిలిన రోజులకు మీరు జీతాలు ఇచ్చేస్తే మేం కూడా జీతాలు తిరిగి ఇవ్వడానికి రెడీగా ఉన్నాం. కేసీఆర్ 20 ప్రశ్నలు అడిగితే ఒకదానికి కూడా సమాధానం చెప్పలేదు. చంద్రబాబు దగ్గరున్న ఊర కుక్కలతో మొరిగించాడు. చంద్రబాబూ నీ టైమ్ అయిపోయింది. కాబట్టి ఇప్పటికైనా బుద్ది తెచ్చుకుని ప్రజల కష్టాలు, నష్టాలు తెలుసుకుని పరిపాలన సాగించు. ఎన్నికలు వస్తున్నాయ్ అని చెప్పి ఎక్కడపడితే అక్కడ శంకుస్థాపనలు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు పెద్ద సైకో. మాది కోడి కత్తి పార్టీ అంటూ విమర్శిస్తున్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన మీది కట్టప్ప కత్తి పార్టీయా’ అంటూ కొడాలి నాని విమర్శించారు.

tags : kodali nani, chandrababu,fire

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info