A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
టిడిపి, కాంగ్రెస్ కొత్త డ్రామా
Share |
March 23 2019, 10:01 am

తెలుగుదేశం,కాంగ్రెస్ పార్టీలు కొత్త డ్రామాకు తెరతీస్తున్నాయా?టిడిపి మీడియా లో వచ్చిన ఒక కధనం ప్రకారం ఎపిలో రెండు పార్టీల మద్య పొత్తు ఉండవకపోవచ్చు.రాష్ట్రాల స్థాయిలో ఎవరికి వారు పోటీచేసి, జాతీయ స్తాయిలో బిజెపికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తో కలుస్తారట. కొద్ది రోజుల క్రితం చంద్రబాబు సూచనప్రాయంగా ఈ విషయం చెప్పారు.రాహుల్ గాందీ కూడా ఇవే సంకేతాలు ఇచ్చారని ఆ కదనం చెబుతోంది.ఇంతవరకు రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్న భావన రెండు పార్టీలలో ఉంది. అయితే తెలంగాణలో ఘోరంగా ఓడిపోయిన నేపద్యంలో ప్రజల మనోభావాలకు తగిన విదంగా ఎపిలో కాంగ్రెస్ తో పొత్తుపై నిర్ణయం చేస్తామని చంద్రబాబు వెల్లడించారని సమాచారం. రాష్ట్రాల్లో పొత్తు గురించే కాకుండా జాతీయస్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమి ఏర్పాటు ప్రస్తుతం చరిత్రాత్మక అవసరమనే అభిప్రాయానికి రాహుల్,చంద్రబాబు వచ్చినట్లు చెబుతున్నారు. కొన్ని ఇతర రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి ఉందని కూడా చెబుతున్నారు.విడి,విడిగా పోటీచేసి కాంగ్రెస్,టిడిపిలు ఎపిలో మాచ్ పిక్సింగ్ ద్వారా పోటీ చేస్తాయన్నమాట. ప్లాన్ బి అమలు చేయడానికి సిద్దం అవుతున్నారట.

tags : congress, tdp,new drama

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info