A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం కుప్పలుతెప్పలు
Share |
March 23 2019, 10:06 am

తెలంగాణ ప్రభుత్వానికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పెద్ద సమస్య అయ్యేలా ఉన్నాయి. టిఆర్ఎస్ ఎన్నికల మానిపెస్టోలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తామని ప్రకటించడంతో ఓటర్లు బాగా ఆకర్షితులయ్యారు. ప్రభుత్వం ఏర్పడినత తర్వాత అనేక మంది పేదలు ఆన్ లైన్ ద్వారా ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.ఆన్ లైన్ ద్వారా మీసేవ సెంటర్ లలోఅప్లై చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది.ఆన్ లైన్ ద్వారానే కాకుండా పలువురు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఆశావహులు కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తులు ఇచ్చి వస్తున్నారు.ముఖ్యంగా హైదరాబాద్, మెడ్చల్,రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలల పరిదిలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.ఈ జిల్లాలలో గత పది రోజులలో ఏభైవేల దరఖాస్తులు చొప్పున వచ్చాయని అదికారులు చెబుతున్నారు.హైదరాబాద్ లో రెండున్నర లక్షల దరఖాస్తులు,రంగారెడ్డిలో 2.30 లక్షలు,మేడ్చల్1.28లక్షలు, సంగారెడ్డిలో 1.49 లక్షల దరఖాస్తులు వచ్చాయి.మొత్తం లక్ష ఇళ్లకు గాను 7.65 లక్షల దరఖాస్తులు వచ్చాయి.లక్ష ఇళ్లకు గాను 8598 కోట్ల రూపాయలు మంజూరు చేయగా, నిదులు 1745 కోట్ల రూపాయలు ఇంతవరకు ఇచ్చారు.

tags : double bed room houses

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info