A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అగ్రవర్ణ రిజర్వేషన్లు- కాంగ్రెస్ సందేహాలు
Share |
January 18 2019, 1:12 pm

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుపై కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పలు సందేహాలు లేవనెత్తారు. కేంద్ర ప్రభుత్వం అనాలోచితంగా తెచ్చిన ఈ బిల్లుకు మున్ముందు చాలా అడ్డంకులు తప్పవని ఆయన అన్నారు. ‘ఆర్థిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ల కల్పనకు ఏదైనా ప్రాతిపదిక ఉందా? రూ.2.5 లక్షల ఆదాయం దాటితే పన్ను కట్టమంటున్నప్పుడు... రూ.8 లక్షల ఆదాయాన్ని ఆర్థిక వెనుకబాటుతనంగా ఎలా చెబుతారు? ఈ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన కంటే ఊడిపోయేవే ఎక్కువ. ఐదేళ్లలో మోదీ 1.7 లక్షల ఉద్యోగాలిచ్చారు. ఇప్పుడు 10% రిజర్వేషన్లు ఇస్తే అగ్రవర్ణ పేదలకు ఏటా 4,500 ఉద్యోగాలే దక్కుతాయి. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో ఏటా 4,500 మందికి ఉద్యోగాలివ్వడానికి ఈ బిల్లు తెచ్చారా? మరోవైపు ప్రైవేటు రంగంపై ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తూపోతే ఎవ్వరూ పెట్టుబడులు పెట్టరు. ఒడిశాలాంటి రాష్ట్రాల్లో జనరల్‌ కేటగిరీ జనాభా 6% ఉంటే 10% రిజర్వేషన్లు ఎలా వర్తింపజేస్తారు? ఆర్టికల్‌ 15 ప్రకారం సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికే రిజర్వేషన్లు వర్తిస్తాయి. మరి ఆర్థికస్థాయి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించవచ్చా...అన్నది తొలి ప్రశ్న. ఇప్పటికే తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధమని చెప్పింది. ఇక రెండో అడ్డంకి 50% పరిమితి. దేశంలో 76 లక్షల మందికే రూ.8 లక్షలకు మించి ఆదాయం ఉంది. అందులో 55 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఇక మిగిలిన 21 లక్షలమందిని పక్కన పెట్టడానికే ఈ బిల్లు తెస్తున్నారా? దేశంలో 3.7% మాత్రమే ఆదాయపు పన్ను చెల్లిస్తున్నారు. అలాంటప్పుడు ఎవరి ఆదాయమెంతో ఎలా నిర్ధారిస్తారు? నిబంధనలను అడ్డం పెట్టుకొని తప్పుడు ధ్రువీకరణ పత్రాలు తీసుకొస్తారు. అలాంటప్పుడు అధికారంలో ఉన్నవారు తమకు ఇష్టం వచ్చిన వారికి ఉద్యోగాలు ఇవ్వడానికి అవకాశం ఏర్పడుతుందని కపిల్ సిబల్ చెప్పారు.

tags : kapil sibal,doubts

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info