A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నెహ్రూ అలా... మోదీ ఇలా...
Share |
March 23 2019, 10:07 am

దేశానికి స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఆనాటి ప్రదాని జవహర్ లాల్ నెహ్రూ బలహీనవర్గాలకు రిజర్వేషన్లు తెచ్చారని, ఆయన అగ్రవర్ణానికి చెందినవారని, ఇప్పుడు ప్రదాని మోడీ అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు కల్పించారని, మోడీ బలహీనవర్గానికి చెందినవారని కేంద్ర మంత్రి గెహ్లాట్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హామీ ఇచ్చిందని, ఇప్పుడు పలు ప్రశ్నలు వేస్తోందని,మానిపెస్టోలో ఎలా పెట్టారో చెప్పాలని ఆయన అన్నారు.
ఒకవేళ ఇప్పుడు మేం అనుసరించిన విధానానికి భిన్నంగా వాళ్లు తేవాలనుకుంటే ఆ విషయం సభకు చెప్పాలని ఆయన అన్నారు.రాజ్యసభలో బిల్లును ప్రవేశ పెడుతూ మాట్లాడారు. అగ్రవర్ణాలకు చెందిన నెహ్రూ నిమ్న వర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తే, ఇప్పుడు వెనుకబడిన తరగతులకు చెందిన మోదీ అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. ఈ బిల్లు తర్వాత కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటా 49.5% అలాగే ఉంటుంది. ఆ సీలింగ్‌ను మేం ముట్టడం లేదు. ప్రస్తుతం పది శాతం పేదలకు మాత్రమే రిజర్వేషన్‌ వర్తిస్తుంది. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఎలాంటి అన్యాయం జరగదు. రాజ్యాంగ సవరణ ద్వారా ప్రస్తుత కోటా కల్పించినందున సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందని భావిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీలపై ఎలాంటి ఆదాయ పరిమితులు లేవు’ అని గహ్లోత్‌ చెప్పారు.

tags : modi, nehru

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info