A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చిన్న వ్యాపారులకు జిఎస్టిలో పెద్ద రిలీఫ్
Share |
March 23 2019, 10:23 am

జిఎస్టిలో పెద్ద రిలీఫ్ నే కేంద్రం ప్రకటించింది.జిఎస్టి పరిధిలోకి వచ్చే వ్యాపార పరిమితిని పెంచుతూ జిఎస్టి మండలి నిర్ణయం తీసుకుంది.ప్రస్తుతమున్న పరిమితిని రూ.20లక్షల నుంచి రూ.40లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. కాంపొజిషన్‌ పథకం కింద ఉండే పరిమితిని కోటి రూపాయలు నుంచి రూ.1.5కోట్లకు పెంచుతున్నట్లు తెలిపారు. కాంపొజిషన్‌ పథకం కింద వ్యాపారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నులు చెల్లించాలని, రిటర్న్‌ మాత్రం ఏడాదికి ఒకసారి మాత్రమే దాఖలు చేయాలని ఆయన వివరించారు. కాంపొజిషన్‌ పథకం పరిమితిని కోటి రూపాయలు నుంచి రూ.1.5కోట్లకు పెంచామని ఆయన చెప్పారు. ఏప్రిల్‌ 1, 2019 నుంచి ఇది అమల్లోకి వస్తుంది.

tags : gst, relief

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info