A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎన్.టి.ఆర్ బయోపిక్ లో లోపాలేమిటి!
Share |
June 25 2019, 1:04 pm

ఎన్టిఆర్ బయోపిక్ తొలి భాగం సగటున బాగానే ఉందన్న బావన వచ్చినప్పటికీ,కొన్ని లోపాలు కూడా మీడియాలో వస్తున్నాయి.బాలకృష్ణ లుక్ పై పలు రకా వ్యంగ్య వ్యాఖ్యానాలు సోషల్ మీడియాలో వస్తున్నాయి.దీనికి సంబందించి సాక్షి మీడియాలో వచ్చిన ఒక విశ్లేషణ ఆసక్తికరంగా ఉంది. అందులో కొన్ని లోటుపాట్లను అందులో చర్చించారు.ఆ కధనం ఇలా ఉంది.

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన బయోపిక్‌ మూవీ ‘యన్‌.టి.ఆర్ కథానాయకుడు’‌. సినిమా ప్రకటించిన దగ్గర నుంచి ఎన్నో చర్చలకు దారితీసిన యన్‌టిఆర్‌, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో నందమూరి అభిమానులు పండుగ చేసుకుంటున్నా.. సాధారణ ప్రేక్షకులు మాత్రం ఏదో వెలితి ఉందన్నట్టుగా ఫీల్‌ అవుతున్నారు. సినిమాలో నందమూరి తారక రామారావు బాల్యానికి సంబంధించిన సన్నివేశాలు లేకపోవటం.. తొలిసారి ఎన్టీఆర్‌, ఎల్వీ ప్రసాద్‌లు ఎక్కడ కలిసారు.. ఎల్వీ ప్రసాద్‌ ఎందుకు ఎన్టీఆర్‌కు సినిమా అవకాశం ఇస్తా అన్నారు.. అన్న విషయాలు చూపించకపోవటం లాంటివి కథ అసంపూర్తిగా విన్న భావన కలిగిస్తాయి. ఎన్టీఆర్‌ యువకుడిగా కనిపించే సీన్స్‌లో బాలయ్య లుక్‌పై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు.

సెకండ్‌ హాఫ్‌లోనూ అలాంటి సన్నివేశాలు చాలా కనిపిస్తాయి. ఎన్టీఆర్‌, చంద్రబాబు నాయుడుల పరిచయం, ఎన్టీఆర్‌ తన కుమార్తెను చంద్రబాబు నాయుడికి ఇచ్చి వివాహం చేయటం లాంటి కీలకమైన సంఘటనలకు కూడా సినిమాలో చోటివ్వలేదు. ఎక్కువగా బాలకృష్ణను వివిధ గెటప్‌లలో చూపించేందుకే సమయం కేటాయించారు. సీతా రామ కళ్యాణం సినిమాలో రావణాసురుడిని దశకంఠుడిగా చూపించేందుకు ఏకంగా 20 గంటల పాటు రెప్ప కూడా వేయకుండా ఎన్టీఆర్ ఒకే స్టిల్‌లో నిలబడ్డట్టుగా చూపించటం అంత నమ్మశక్యంగా అనిపించదు. ఎన్టీఆర్‌ కెరీర్‌లో ఘనవిజయం సాధించిన చిత్రాలను మాత్రమే ప్రస్తావిస్తూ ఫెయిల్యూర్స్‌ను పక్కన పెట్టేయటంతో డ్రామా మిస్‌ అయిన ఫీలింగ్‌ కలుగుతుంది. ఇక దాన వీర శూర కర్ణ సినిమాలో ఎన్టీఆర్ అనర్గళంగా చెప్పిన ‘ఏమంటివి ఏమంటివి’ డైలాగ్‌ను బాలయ్య చెప్పకుండా కేవలం ఎన్టీఆర్ వాయిస్‌కు యాక్ట్ చేయటం కూడా అభిమానులను నిరాశపరిచే అంశమే.(సాక్షి సౌజన్యంతో )

tags : ntr, biopic

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info