A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
మల్కాజిగిరి నుంచి మాజీ ఐఎఎస్ పోటీ చేస్తారా
Share |
March 22 2019, 2:03 pm

మల్కాజిగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి టిఆర్ఎస్ అభ్యర్ధిగా రిటైర్డ్ ఐఎఎస్ అదికారి,ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుగా ఉన్న రాజీవ్‌ శర్మను పోటీ చేయించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అయిన ఆయన.. గతంలో కేంద్ర ప్రభు త్వంలో పనిచేశారు. ఆయనకు ఢిల్లీలో ఉన్న పరిచయాలు.. పార్టీకి బాగా ఉపయోగపడతాయని కేసీఆర్‌ భావిస్తున్నట్టు తెలిసింది.
సిట్టింగుల్లో అత్యధిక మందికి సీట్లు ఇస్తామంటూ కేసీఆర్‌ చెబుతున్నప్పటికీ.. కనీసం ఐదు స్థానాల్లో అభ్యర్థులను మార్చనున్నారని తెలిసింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పార్టీ మారడంతో అక్కడ కొత్త వారిని బరిలో దింపనున్నారు. ఈ క్రమంలో మండలి చైర్మెన్‌ స్వామిగౌడ్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం మరో రెణ్నెల్లలో ముగియనుంది. దీంతో చేవెళ్లకు స్థానికుడైన స్వామిగౌడ్‌ను అక్కడి నుంచి బరిలోకి దింపే అవకాశముంది. ఇదే టికెట్‌ కోసం మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి సైతం ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారని తెలిసింది. తాండూరు నుంచి ఓటమి పాలైన ఆయన.. ఈసారి ఎంపీగా గెలవటం ద్వారా తన సత్తా చాటాలని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో మల్కాజ్‌గిరి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి.. ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో అక్కడి నుంచి రాజీవ్‌శర్మను బరిలోకి దింపేందుకు కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఇదే సీటుపై కేంద్ర మాజీ మంత్రి సముద్రాల వేణుగోపాలాచారి కూడా ఆశలు పెట్టుకున్నారు. మరోవైపు ఉప్పల్‌ ఎమ్మెల్యే సీటును ఆశించి భంగపడ్డ హైదరాబాద్‌ నగర మేయర్‌ బొంతు రామ్మెహన్‌ సైతం మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాలని భావిస్తున్నారు.

tags : rajiv sarma, malkajigiri

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info