A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఏపీ మంత్రులందరూ ఫెయిల్…లోకేషే సూపర్
Share |
June 25 2019, 2:11 pm

ఏపీ మంత్రులందరూ ఫెయిల్…లోకేషే సూపర్ మినిస్టర్!అంటూ వాసిరెడ్డి శ్రీనివాస్ తెలుగు గేట్ వేలో ఇచ్చిన ఈ కదనం ఆసక్తికరంగా ఉంది....

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేబినెట్ లోని మంత్రులందరూ ఫెయిల్ అయ్యారా?. ఒక్క లోకేష్ మాత్రం సూపర్ మ్యాన్ లా సక్సెస్ సాధించారా?. అందరి కంటే వెనక మంత్రి పదవి చేపట్టి..అందరూ ఆశ్చర్యపోయేలా సీనియర్లను కూడా లోకేష్ దాటిపోయారా?. ఇప్పుడే ఏ మంత్రీ అందుకోలేనంత ఉన్నత స్థానానికి లోకేష్ చేరుకనునట్లా?. ప్రస్తుతం ఏపీ మంత్రుల్లో ఇదే అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకూ రాష్ట్ర చరిత్రలో ప్రభుత్వం ప్రకటనలు ఇఛ్చింది కానీ..ఒక మంత్రి ఏకంగా తన శాఖ విషయాలను..తాను సాధించిన ప్రగతిని వివరిస్తూ టీవీల్లో ప్రకటనలు ఇవ్వటం చాలా అరుదైన విషయంగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎవరైనా మంత్రి శాఖలో కీలక ఘట్టం జరిగితే అందులోనూ సహజంగానే ముఖ్యమంత్రి ఫోటోతోపాటు..మంత్రి ఫోటో కూడా ఉంటుంది. కానీ ఏకంగా నారా లోకేష్ పంచాయతీరాజ్ శాఖలో తాను ఇన్ని రోడ్లను అభివృద్ధి చేశాను…ఇన్ని రోడ్లను అద్భుతంగా తీర్చిదిద్దాను అంటూ టీవీల నిండా యాడ్స్ ఇస్తున్నారు.మరి ఈ ‘ప్రత్యేక యాడ్స్’ సౌకర్యం ఒక్క లోకేష్ కు మాత్రమే ఎందుకు ఇఛ్చారు?. మిగిలిన మంత్రులు ఎవరూ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో తమ తమత శాఖల్లో ఏమీ పనిచేయలేదా?. వాళ్ళ వాళ్ల శాఖల్లో విజయాలే లేవా?. ఒక్క లోకేష్ మాత్రమే సక్సెస్ ఫుల్ మంత్రా?. మిగిలిన వాళ్ళు అంతా ఫెయిల్ అయినట్లేనా?. మిగిలిన మంత్రులకు ప్రచారం అవసరం లేదు?. ఒక్క లోకేష్ చేసుకుంటే చాలు అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భావిస్తున్నారా?. లోకేష్ తన సొంత ప్రచారం కింద చెప్పుకునే గ్రామీణ రోడ్ల అభివృద్ధి పనులు ఎక్కువ శాతం చేపట్టింది కేంద్ర నిధులతోనే. కానీ అసలు కేంద్రం నిధులే ఇవ్వలేదని చెబుతూ ఇప్పుడు అదే నిధులతో చేపట్టిన రోడ్ల పనులను తన ఖాతాలో వేసుకుని ‘ప్రత్యేక ప్రకటనలు ’ ఇచ్చుకోవటమే వింత.

tags : vasireddy srinivas, ministers

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info