A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బాబుతో మోడీకి మంచి అనుభవమే-కామెంట్
Share |
June 25 2019, 2:14 pm

ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు ప్రభుత్వంలో జరిగిన అవినీతిని ఆయన ఎండగట్టారు. ఏ రాష్ట్రానికి చేయని విదంగా పది విద్యాసంస్థలను నెలకొల్పామనివేల కోట్ల ఆర్దిక సాయం చేశామని,ఈ విషయాన్ని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని ఆయన ఎపి బిజెపి కార్యకర్తలను కోరారు.తెలంగాణలో మహాకూటమి ఓటమి చెందనున్నట్లు ఎపిలో కూడా టిడిపి, కాంగ్రెస్ కూటమికి ఓటమి తప్పదని ఆయన అబిప్రాయపడ్డారు. బిజెపి ఒకందుకు సంతోషపడుతోంది.తెలంగాణలో తనకు డిపాజిట్లు దక్కకపోయినా, కాంగ్రెస్,టిడిపి,సిపిఐ, తెలంగాణ సమితి కూటమి ఘోర పరాజయానికి గురి కావడం వారికి సంతృప్తి కలిగించిందని అనుకోవాలి.ఎందుకంటే తనకు ఒక కన్ను పోయినా పర్వాలేదు..ఎదుటివాడికి రెండు కళ్లు పోవాలని రాజకీయ పార్టీలు కోరుకుంటాయి. అదే జరిగింది.ఇక ఎపిలో ఏమి జరుగుతుందన్నది చర్చనీయాంశంగా ఉంది.బిజెపి,జనసేనలు మైనస్ అయ్యాక తెలుగుదేశం పార్టీ కలవరపడుతున్నమాట నిజం.అనూహ్యమైన పరిణామాలలో చంద్రబాబు ఎన్.డి.ఎ. నుంచి బయటకు వచ్చారు.ఆ తర్వాత చంద్రబాబు నాయుడు కొంత భయపడినట్లు కనిపించినా, తదుపరి ఏదైనా ధైర్యం వచ్చిందో,లేక కాంగ్రెస్ తనకు అండగా ఉంటుందన్న భావన ఏర్పడిందో తెలియదు కాని,మోడీపై విమర్శలు చేయడం ఆరంబించారు. అది హద్దులు దాటి నలభైఏళ్ల సీనియర్ అన్న సంగతిని విస్మరించి చాలా నీచంగా మోడీని దూషించడం ఆరంబించారు.పార్లమెంటులో ఒకసారి మాత్రం చంద్రబాబు పరిణితి లేకుండా వ్యవహరించాడని, కెసిఆర్ పరిణితిగా ఉన్నారని అనడం తప్ప మోడీ ఇతరత్రా పెద్ద విమర్శలు చేయలేదు.అయినా చంద్రబాబు నోటికి వచ్చినట్లు మాట్లాడడం సాగించారు. గతంలో కాంగ్రెస్ ను చెత్త పార్టీ అని, సోనియాగాందీ దెయ్యం, నాలుగున్నర లక్షల కోట్లు ఇటలీకి తరలించుకుపోయిందని, ఆంద్రుల పొట్ట కొట్టిందని ఎలా విమర్శించారో, ఇప్పుడు రోజూ చంద్రబాబు బిజెపిని ఉద్దేశించి అదే తరహాలో విమర్శలు చేస్తున్నారు.మోడీని మోసగాడని అంటున్నారు. గతంలో చంద్రబాబు,బిజెపి నేత,అప్పట్లో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్య నాయుడు కలిసి పలు షభలలో మాట్లాడేవారు.బాబూ,మోడీ జోడి..అభివృద్ది పరుగుపెడుతోందని వెంకయ్య ప్రచారం చేసేవారు.ఆ సభలలో చంద్రబాబు ముసి,ముసి నవ్వులతో కూర్చునేవారు.అప్పుడు కేంద్రంలో, బిజెపిలో,మోడీలో చంద్రబాబుకు అంతా అబివృద్దే కనిపించేది.కాని ఇప్పుడు మోడీలో మోసం కనిపిస్తోంది.అంటే వెంకయ్య కూడా మోసం చేశారని చెబుతున్నారా?లేక చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి మోసం చేసినట్లు అనుకోవాలా?కేంద్రం లక్షా నలభైవేల కోట్లు ఇచ్చిందని లోక్ సభలో టిడిపి ఎమ్.పి మురళీమోహన్ కు ఇచ్చిన సమాదానంలో చెబితే దానిని టిడిపి ఖండించలేదు. వాటన్నిటికి సమాదానంగా మోడీ మాట్టాడినట్లుగా ఉంది. ఎపిలో అవినీతి తారాస్తాయికి చేరిందని ఆయన అంటున్నారు.అది నిజమే అయితే మోడీ కూడా బాద్యత వహించాలి కదా?జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నిర్మించవలసిన పోలవరాన్ని రాష్ట్రానికి ఎందుకు ఇచ్చినట్లు?ఆ తర్వాత అదంతా తానే నిర్మిస్తున్నట్లు చంద్రబాబు బిల్డప్ ఇస్తుంటే బిజెపి నేతలు కాని, కేంద్ర మంత్రులు కాని ఎందుకు మౌనంగాఉన్నారు?రాజదానికి 2500 కోట్లు ఇస్తే ఏమి చేశారని ఎందుకు అడగలేకపోయారు?అమరావతిలో హైకోర్టు కట్టేశామని రాష్ట్రం జవాబు పంపితే ఔను,ఔను అని లోక్ సభలో కేంద్ర మంత్రి గుడ్డిగా ఎలా సమాదానం చెప్పినట్లు?ఆరువేల కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసం చేసినట్లు అబియోగాలు ఉన్న టిడిపి ఎమ్.పి సుజనా చౌదరిని తన పక్కన మోడీ ఎందుకు మంత్రిగా కూర్చుపెట్టుకున్నట్లు? అదంతా కక్ష అని చంద్రబాబు ప్రచారం చేస్తుంటే, కేంద్ర మంత్రులు ఎవరూ ఎందుకు సమాదానం చెప్పలేకపోతున్నారు.ఎపిలో బిజెపికి పెద్దగా ఓట్లు లేవు.అందువల్ల వారు సీరియస్ గా తీసుకోలేదా?లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?చంద్రబాబు కాని, టిడిపి నేతలు కాని కేంద్రాన్ని,మోడీని బండబూతులు తిడుతున్నారు.తద్వారా ఎపికి కూడా వారు నష్టం చేస్తున్నారు. మరోవైపు బిజిపిలో కొందరు నేతలు చంద్రబాబు అవినీతిపై బండబూతులు తిడుతున్నారు.కాని ఇద్దరూ అవినీతిపై తిట్టుకోవడమేకాని, నిర్దిష్టంగా చర్యలు తీసుకునే పరిస్తితి కనబడడం లేదు .పోలవరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేంద్రం భావిస్తుంటే ఎందుకు విచారణకు ఆదేశించలేదు.సిబిఐ విచారణకు ఎపి అనుమతించకపోయినా, కోర్టులో ఆ విషయం తెలియచేసి ఎందుకు చర్య తీసుకోలేకపోతున్నారు.ఒకప్పుడు ఓటుకు నోటు కేసులో రాజీచేసిన బిజెపి పెద్దలు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో అవినీతి ఉందని ప్రచారం చేస్తున్నారు.ఓటుకు నోటు కేసును చట్టం ప్రకారం ఎందుకు సాగనివ్వలేదు?చంద్రబాబు విపక్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 23 మందిని కొనుగోలు చేస్తున్నప్పుడు బిజెపి ప్రేక్షకపాత్ర పోషించింది. అలాగే పలు అంశాలపై నిబందనల ప్రకారం ఎపి ప్రభుత్వంపై చర్య తీసుకోవడానికి ఇంతకాలం బిజెపి ఆద్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం వెనుకాడింది.దానికి కారణం మిత్రపక్షం కావడమే. ఏతావాతా చెప్పవచ్చేదేమిటంటే రాజకీయ పార్టీలు మిత్రపక్షాలుగా ఉంటే ఒకరకంగా,లేకుంటే మరో రకంగా ఉండడం వల్ల చట్టం,రాజ్యాంగం భ్రష్టు పట్టిపోతున్నాయి.ప్రభుత్వాలు ,ప్రభుత్వాలుగా నడవకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి.ప్రధాని మోడీకి కూడా ఇది మంచి అనుభవమే. మరి భవిష్యత్తులో ఏమి చేస్తారో చూద్దాం.

tags : modi, chadnrababu, comment

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info