A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో 25 జిల్లాలు చేస్తాం
Share |
June 25 2019, 1:12 pm

తమ పార్టీ అదికారంలోకి రాగానే ఎపిలో 25 జిల్లాలు ఏర్పాటు చేస్తామని విపక్ష నేత జగన్ అన్నారు.ఇచ్చాపురంలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.
మీ అందరి చల్లని దీవెనలతో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళణ చేయాలి. మనం చెప్పిన పథకాలు, మనం చెప్పే పనులు జరగాలంటే ఒక పటిష్టమైన వ్యవస్థ రావాలి. ఏదైనా పథకం చెబితే ఆ పథకం ప్రతీ పేదవాడి ఇంటికి చేరాలి. ఆ పేదవాడు ఏ పార్టీ, ఏ కులం, ఏం చేస్తున్నాడనేది అడ్డు రాకూడదని చెబుతున్నా. ఈ వ్యవస్థలోకి మార్పు తీసుకురావాలి. మారిన వ్యవస్థను పూర్తిగా ప్రతి పేదవాడికి దగ్గరకు తీసుకుపోవాలి. ప్రతి పథకం ప్రతి పేదవాడికి అందించాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ వ్యవస్థలోకి తీసుకొచ్చే మొట్ట మొదటి మార్పు జిల్లా స్థాయిలో చేస్తాం. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారుస్తాం. ప్రతి పార్లమెంటు నియజకవర్గాన్ని ఒక జిల్లాగా చేస్తామని మీఅందరికి చెబుతున్నా. ఈ మార్పు ఎందుకంటే.. ప్రతి కలెక్టర్‌ ఏడు అసెంబ్లీ స్థానాలకు మాత్రమే జవాబుదారీతనంగా ఉండాలి. ప్రస్తుతం అసెంబ్లీ స్థానాలు ఎక్కువగా ఉండటంతో కలెక్టర్లకు జవాబుదారీతనం లేకుండా ఉంది. కలెక్టర్‌.. ప్రజలకు దగ్గరగా ఉండాలి. కలెక్టర్‌ చేతినిండా పని ఉండేలా చేసేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నాం.అని ఆయన అన్నారు.

tags : ap,new districts

Latest News
*కాల్ సెక్స్ మనీ కేసులు-జగన్
*ప్రజావేదిక తొలగించండి..కాకపోతే..కేశినేని సలహా
*గోదావరి నీటిని శ్రీశైలానికి ఎలా అంటే..
*గ్రామ వలంటీర్లు- కొణతాల ఆరోపణ
*ప్రజావేదికకు 11 కోట్లు ఖర్చు-టిడిపి నేత వెల్లడి
*మంత్రిని మందలించిన జగన్
*ఇక పై ప్రతివారం ఎపిలో ప్రజల స్పందన-
*ప్రజలే ఎదురు తిరగాలి-పవన్ కళ్యాణ్
*డాలస్ లో ఉత్సాహంగా యోగా
*అమరావతి రింగ్ రోడ్డుకు కేంద్రం రెడీ
*బిజెపి లో మరో పార్టీ విలీనం
*మా అవినీతి ఎక్కడ- లోకేష్ ప్రశ్న
*టిడిపి నేతలు ఎందుకు ఉలిక్కి పడుతున్నార
*పార్టీకి సేవ చేసిన ప్రతి వారితో భేటీ అవుతా-పవన్
*చంద్రబాబు కుటుంబ సభ్యులకు భద్రత కుదింపు
*కాళేశ్వరం ప్రాజెక్టు -గొప్ప విషయమే కాని..
*ఇకపై అనుమతి ఉంటేనే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్
*యనమల ఎంత అన్యాయంగా మాట్లాడారు
*వైఎస్ జయంతి నాడు రైతు దినోత్సవం
*సే నో టు మాఫియా...జగన్ విస్పష్ట ప్రకటన
*లంచాలు ఉండొద్దు..ఆఫీస్ ల చుట్టూ తిరగొద్దు
*34 లక్షల కోట్ల నల్లధనం విదేశాలలో
*బిజెపిలోకి మరో ఎమ్మెల్యే
*జగన్ రచ్చబండ ఇందుకట..టిడిపి మీడియా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info