A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రెయిన్ గన్ ల నిర్వాకంపై జగన్ వ్యాఖ్య
Share |
June 17 2019, 3:11 pm

ఐదెకరాల్లో అర బస్తా పండింది.. ఇదీ రెయిన్‌ గన్‌ నిర్వాకం అని ఇచ్చాపురం సభలో విపక్ష నేత జగన్ వ్యాఖ్యానించారు.తన పాదయాత్రలో ఎదురైన కొన్ని అనుభవాలను ఆయన వివరిస్తూ ఈ వ్యాఖ్య చేశారు.ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
బాబు పాలన మీద 14 నెలల నా పాదయాత్రలో అనుభవాలను కొన్నిటిని ఈరోజు మీతో పంచుకుంటా... అనంతపురం జిల్లాలో నాకు శివన్న అనే రైతు కలిశాడు. తన పొలంలో రెయిన్‌గన్ల నుంచి గురించి కథలు కథలుగా చెప్పాడు. చంద్రబాబు రెయిన్‌ గన్‌ అని చెప్పి చూపించిన సినిమా ఎలా ఉందో కంటికి కట్టినట్లుగా వివరించాడు. అన్నపూర్ణ లాంటి ఈ రాష్ట్రంలో వ్యవసాయం ఎలా కుదేలైపోయిందో, రైతులు ఎలా కూలీలుగా మారిపోయారో, లక్షల మంది ఎలా వలసలు వెళ్తున్నారో కళ్లారా చూశానని చెప్పాడు. శివన్న అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ వద్ద పాదయాత్ర చేస్తున్నప్పుడు నా వద్దకు వచ్చాడు. ‘‘అన్నా రూ.90 వేలు అప్పు చేసి వేరుశనగ పంట వేశా’’ అని చెప్పాడు. మరి పరిస్థితి ఎలా ఉందని అడిగితే.. ‘‘అన్నా బాబు గారు వచ్చారు. బాబుగారితోపాటే ఇంకొకటి కూడా కలిసే వస్తుందన్నా ఎప్పుడు వచ్చినా చంద్రబాబుగారితోపాటు. అది.. బాబు వస్తే కరువు కూడా వస్తుందన్నా..’’ అని చెప్పాడు. ‘‘అన్నా.. యథాప్రకారం కరవు వచ్చిందన్నా. రైతులు విలవిలలాడుతున్నారన్నా. చంద్రబాబు గారు అనంతపురం జిల్లా పర్యటన పెట్టుకున్నప్పుడు కరువుతో చచ్చిపోతున్నామయ్యా... పంటలు ఎండిపోతున్నాయయ్యా.. సాయం చేయండయ్యా..’’ అని శివన్న చంద్రబాబు గారిని గట్టిగా అడిగితే ఆయన ఏమన్నారో తెలుసా?.. ‘‘అయ్యో కరువు వచ్చిందా? నాకు ఇంతవరకు తెలియదే? నాకు ఎప్పడూ చెప్పలేదే’’ అని అధికారులను తిట్టారట రైతన్నల ఎదుట.అని జగన్ పేర్కొన్నారు.

tags : jagan,rain gun

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info