A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చివరికి రాజ్యసభలోను విపక్షాలకు తప్పలేదు
Share |
March 23 2019, 10:16 am

రాజ్యసభలో అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు కల్పించాలన్న బిల్లుకు రాజ్యసభ కూడా ఆమోదం తెలిపింది.ఈ బిల్లును ఏదో రూపంలో వాయిదా వేయించాలని ప్రతిపక్షాలు ప్రయత్నించాయి.కాని అది సాద్యపడలేదు.చివరికి ఆ పక్షాలు కూడా మద్దతు ఇవ్వక తప్పలేదు. లోక్ సభలో ఆమోదం పొందిన తర్వాత బిల్లు రాజ్యషభకు వచ్చింది.ఈ బిల్లు కోసం రాజ్యసభను ఒక రోజు పొడిగించారు.దీనిని విపక్షాలు తప్పు పట్టాయి.చివరిగా ఓటింగ్ లో కాంగ్రెస్ తో సహా దాదాపు అన్ని పక్షాలు ఆమోదం తెలిపాయి.124 వ రాజ్యాంగ సవరణ బిల్లుకు 165-7 ఓట్ల తేడాతో ఆమోదముద్ర వేసింది. బిల్లును సెలెక్ట్‌ కమిటీకి పంపాలని, ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలని సభ్యులు ప్రతిపాదించిన సవరణలను తోసిపుచ్చింది. ఇప్పటివరకూ 50 శాతంగా ఉన్న రిజర్వేషన్ల పరిధి 60 శాతానికి పెరిగింది. రాజ్యాంగంలో 15(6), 16(6) పేరుతో కొత్త సబ్‌ క్లాజ్‌లు చేరాయి. డీఎంకె, ఏఐడీఎంకె, ఆర్‌జేడీ, ఐయూఎంల్‌ పార్టీలు మినహాయించి మిగిలిన అన్ని పార్టీలూ సంపూర్ణ మద్దతు పలికాయి.

tags : parliament, opposition

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info