A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
rఇలా చేస్తే చంద్రబాబు ఇంకా బదన్నాం -కామెంట్
Share |
June 17 2019, 3:19 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానురాను విచక్షణ కోల్పుతున్నట్లుగా ఉంది.విపక్ష నేత,వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ పై విశాఖ పట్నం విమానాశ్రయంలో జరిగిన హత్యాయత్నం కేసులో చంద్రబాబు ఎన్ని పిల్లి మొగ్గలు వేస్తున్న తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒక ప్రభుత్వ అదినేతగా ఇలా మాట్లాడవచ్చా అన్న ప్రశ్న వస్తుంది.జగన్ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ( ఎన్.ఐ.ఎ)కి అప్పగిస్తే ఆయనకు వచ్చే ఇబ్బంది ఏమిటో తెలియదు. పైగా ఎపి ప్రభుత్వం అనుమతి లేదు కనుక ఇంతవరకు జరిగిన విచారణ కు సంబందించిన రికార్డులు ఇవ్వబోమని విశాఖ పట్నం పోలీసులు చెబుతున్నారని వార్తలు వచ్చాయి. అదే కాదు. ఎన్.ఐ.ఎ దర్యాప్తుపై సుప్రింకోర్టులో అప్పీల్ కు వెళతామని కూడా ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు.ఎన్.ఐ.ఎ దర్యాప్తు అవసరం లేదని కేంద్రానికి లేఖ రాస్తారట.ఇవన్ని చూస్తుంటే ఏమి అనిపిస్తుంది. ఇంతకాలం ఇందులో కుట్ర కోణం లేదేమోలే..ముఖ్యమంత్రి చం్రబాబుకు ఇందులో ఏమి ప్రమేయం ఉంటుందిలే అనుకునేవారికి కూడా సందేహాలు వచ్చేలా వారు వ్యవహరిస్తున్నారు.ఇందులో రాష్ట్రాల హక్కులను లాక్కోవడం ఏముంటుంది. హత్య యత్నానికి గురైన బాదితుడే స్వయంగా తనకు రాష్ట్ర ప్రభుత్వం తో సంబందం లేని ధర్డ్ పార్టీతో విచారణ జరిపించాలని కోరినప్పుడు ప్రభుత్వం గౌరవంగా అంగీకరించవలసింది.అది మామూలు కేసు కదా.ఒక క్యాబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేత జగన్ కు సంబందించిన కేసు. సుదీర్ఘపాదయాత్ర చేస్తూ కోట్లాది మంది మద్య తిరుగుతున్న నేతకు సంబందించిన అంశం.ఘటన జరిగిన వెంటనే చంద్రబాబు కనుక జగన్ కు పోన్ చేసి ఘటన వివరాలు ఆరా తీసి, దానిపై మీరు ఎలాంటి విచారణ కావాలని అంటే అలా చేద్దామని చెప్పి ఉంటే చంద్రబాబు గౌరవం పెరిగేది.పైగా ఆయనపై అనుమానానికి ఆస్కారం ఉండేది కాదు. అలాగే డిజిపి కేసు నమోదు కాకుండానే నిందితు జలపల్లి శ్రీనివాసరావు వైఎస్ ఆర్ కాంగ్రెస్ అభిమాని అని ఎలా కనిపిఎట్టారో తెలియదు. ఆ కాసేపటికి కనీసం పరామర్శ చేయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదంతా జగన్ డ్రామా అని వ్యాఖ్యానించారు.నిజంగానే డ్రామా అయితే కేంద్ దర్యాప్తు సంస్థ చేసినా, మరొకరు చేసినా అదే తేలుతుంది కదా?చంద్రబాబు డ్రామా అని అంటే విశాఖ పోలీస్ కమిషనర్ లడ్డా ఇది పక్కా ప్రణాళిక ప్రకారం శ్రీనివాసరావు చేసిన హత్యాయత్నం అని చెప్పారే. అక్కడే చంద్రబాబు, డిజిపి ఠాకూర్ ల పరువు పోయినట్లు కాదా?అయినా కోడికత్తి డ్రామా అంటూ చంద్రబాబు, తెలుగుదేశం మీడియా పిచ్చి ప్రచారం చేసిందే. అదే నిజమైతే ఇప్పుడు ఎన్.ఐ.ఎ దర్యాప్తుకు ఎందుకు భయపడుతున్నారు.అందువల్లే వైఎస్ ఆర్ కాంగ్రెస్ మాజీ ఎమ్.పి మిదున్ రెడ్డి దీనిని నారా కత్తి డ్రామా అని,తమ పార్టీ అదినేత జగన్ పై జరిగిన కుట్ర అని విమర్శిస్తున్నారు.మరో వైపు మంత్రి లోకేష్ అంతర్జాతీయ సంస్తతో దర్యాప్తు చేసినా ఏమీ ఉండదని అంటున్నారే. అంటే తండ్రి ఈ కేసు దర్యాప్తు ఎన్.ఐ.ఎకి ఇస్తే అసలు విషయాలు బయటకు వస్తాయని భయపడుతుంటే, కొడుకు మాత్రం అవేవి బయటపడవని భావిస్తున్నారా?గతంలో పరిటాల రవి హత్య జరిగినప్పుడు చంద్రబాబు ఏ దర్యాప్తు కోరితే దానికి ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆమోదించారే?అంతేకాక స్వయంగా తన కుమారుడు జగన్ పై సిబిఐ విచారణ అడిగినా ఒప్పుకున్నారే.అలాంటిది ఎవరో ఎవరికి తెలియని ఒక వ్యక్తి ఇలాంటి హత్యాయత్నానికి పాల్పడితే,ఆ కేసులో కుట్ర కోణం సెక్షన్ పెట్టకుండా కేసు నమోదు చేయడమే పెద్ద అనుమానానికి దారి తీసింది. ఆ తర్వాత ఎపి పోలీస్ అధికారులు వద్దని వైఎస్ ఆర్ కాంగ్రెస్ అడిగినప్పుడు అంగీకరించి ఉంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆ తర్వాత వారు హైకోర్టును ఆశ్రయించినప్పుడు , విమానాశ్రాలలో జరిగే నేరాలు ఎన్.ఐ.ఎ పరిదిలోకి వస్తాయని వెల్లడైనప్పుడు వెంటనే వారికి అప్పగించి ఉంటే మర్యాదగా ఉండేది. చివరకు హైకోర్టు అడిగితే కూడా దీనిపై సరైన సమాదానం చెప్పకుండా దాటవేయకుండా ఎవరు దర్యాప్తు చేసినా ఇబ్బంది లేదని అంటే సందేహాలకు ఆస్కారం ఉండేది కాదు.తీరా హైకోర్టు అడిగిన మీదట కేంద్రం ఎన్.ఐ.ఎ.కి అప్పగిస్తే , అప్పుడు కూడా చంద్రబాబు అభ్యంతరం చెప్పడం, హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడడం ద్వారా తాను ఆత్మరక్షణలో ఉన్నానని చంద్రబాబు తనకు తాను తెలియచేసుకున్నట్లయింది. కచ్చితంగా ఇందులో కుట్ర ఉందని, జగన్ కు ప్రాణహాని తలపెట్టడానికి పెద్ద ప్రయత్నమే జరిగిందన్న అనుమానం బలపడింది.పైగా పోలీసులు విచారణలో ఎయిర్ పోర్టు హోటల్ యజమానిని హర్షవర్ధన్ ను సరిగా విచారించకపోవడం, ఇప్పుడు వారు చేసిన విచారణ రికార్డులు ఇవ్వడానికి సి్ద్దపడకపోవడం..ఏ కోణంలో చూపినా అన్ని వేళ్లు చంద్రబాబు ప్రభుత్వాన్ని తప్పుపడుతున్నాయి. నిజంగానే ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దలకు ఈ హత్యాయత్నంతో ఎలాంటి సంబందం లేకపోతే ఎన్.ఐ.ఎ.కి సహకరించడం మంచిది.లేకుంటే జనంలో చంద్రబాబు ఇంకా బదనామ్ అవుతారని చెప్పక తప్పదు.

tags : jagan,chadnrabbu

Latest News
*ఇక టిడిపి కోలుకోలేదు- బిజెపి
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*ఉప సబాపతిగా కోన రఘుపతి నామినేషన్
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info