A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజలు క ర్రు కాల్చి వాత పెడతారు
Share |
March 23 2019, 9:39 am

దేశంలోని రాజకీయ పార్టీలన్నీ అగ్రవర్ణ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు తెలుపకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని బిజెపి తెలంగాణ శాఖ అద్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ హెచ్చరించారు. అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్లు దశాబ్దాల డిమాండ్ అని సామాజిక వివక్షకు సంబంధించిన రిజర్వేషన్లతో పాటు ఆర్థిక వెనుకబాటు ఆధారంగా కూడా రిజర్వేషన్లు అవసరమన్నారు. ఈ సాహసోపేత నిర్ణయం అమలు చేసిన ఘనత మోదీనే అని తెలిపారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలు, ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తుందని ఆరోపించారు. అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. అసదుద్దీన్ ది నోరా.. తాటి మట్టా? అని ఫైర్‌ అయ్యారు.

tags : lakshman, reservations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info