A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అద్యాపకుల రిటైర్ మెంట్ వయసు పెంపు
Share |
March 23 2019, 9:39 am

యూనివర్శిటీలలో అద్యాపకుల పదవీ విరమణ వయసు అరవై ఐదేళ్లకు పెంచుతూ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నిర్ణయం తీసుకున్నారు.ప్రస్తుతం రిటైర్ మెంట్ వయసు అరవై రెండేళ్లుగా ఉంది. యూనివర్సిటీ వైఎస్‌ ఛాన్సలర్‌ (వీ.సీ) విరమణ వయస్సును కూడా 70 ఏళ్లకు పెంచారు. 60 ఏళ్లు దాటిన తరువాత ఓ ఉద్యోగి పనిచేయలేడని తాను అనుకోనని, వారి అనుభవాలు, సేవలు మన విద్యార్థులకు చాలా అవసరం అని ఆమె అన్నారు. అందుకే అధ్యాపకుల పదవీ విరమణ వయస్సును పెంచుతున్నాం. బలహీన వర్గాల ఉన్నత విద్య కోసం రూ.200 కోట్లు విడుదల చేస్తున్నాం. మౌలిక సదుపాయాల కోసం రూ. 28000 కోట్లను ఈ ఏడాదికి ఖర్చు చేయదలచాం’ అని తెలిపారు.

tags : west bengal,retirmenet

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info