A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
జనసేనలోకి బిజెపి ఎమ్మెల్యే
Share |
January 18 2019, 12:47 pm

ఎపి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఆయన జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్టీ మారుతున్న సందర్భంగా ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.. ఈ నెల 21న జనసేనలో చేరుతున్నట్టు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిందని, ప్రధానంగా మూడు అంశాల్లో అన్యాయం చేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. విశాఖ రైల్వేజోన్‌, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్‌ప్లాంట్‌ మంజూరు చేయకుండా అన్యాయం చేసిందని ఆయన అన్నారు. ఎలాంటి సరతులు లేకుండా జనసేనలో చేరుతున్నానని ఆయన అన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తనను పార్టీలోకి ఆహ్వానించారని, ఆయన ఏ పదవి ఇచ్చినా స్వీకరించేందుకు తాను సిద్ధమని ఆయన తెలిపారు.

tags : akula, janasena

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info