A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
చంద్రబాబు ను నమ్మం అంటున్న ప్రజలు
Share |
June 17 2019, 3:05 pm

ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మబోమని చెబుతున్నారని విపక్ష నేత జగన్ అన్నారు. ఇచ్చాపురంలో ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసిన సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఆయా అంశాలను వివరిస్తూ ప్రజలు చంద్రబాబును నమ్మం బాబు అంటున్నారని ఆయన అన్నారు.
రాష్ట్రంలో పంటలు దిగుబడి చూస్తే గుండెతరక్కుపోతుంది. దివంగత నేత వైఎస్సార్‌ హయాంలో సాగు విస్తీర్ణం 42.70 లక్షల హెక్టార్లు ఉంటే.. చంద్రబాబు హయాంలో 40 లక్షల హెక్టార్లకు పడిపోయింది. కానీ ఈ పెద్ద మనషీ నదుల అనుసంధానం అంటాడు. దేశంలోనే వ్యవసాయంలో మనరాష్ట్రమే నెంబర్‌ వన్‌ అంటాడు. అందుకే చంద్రబాబు నాయుడి ప్రజలు నమ్మం అంటే నమ్మం బాబు అంటున్నారు. నాబార్డ్‌ నివేదిక ప్రకారం వ్యవసాయం నెలవారీగా సగటున వస్తున్న ఆదాయంలో ఆంధ్రప్రదేశ్‌ అట్టడుగున 28 స్థానంలో ఉంది. చంద్రబాబు రైతు రుణమాఫీ మోసం వల్లే రైతులు దారుణంగా నష్టపోయారు. రైతు రుణమాఫీ కనీసం వారి వడ్డీలకు కూడా సరిపోలేదు. వడ్డీ లేకుండా బ్యాంకులు రైతులకు రుణాలిచ్చేవి. ఆ వడ్డీని ప్రభుత్వాలు కట్టేవి. కానీ చంద్రబాబు దీన్ని పూర్తిగా మరిచిపోయారు. దీంతో రైతులంతా చంద్రబాబును నమ్మం అంటున్నారు. నాలుగున్నరేళ్ల కాలంలో ఏ పంటకైనా గిట్టుబాటు ధర వచ్చిందా అడుగుతున్నా? అని అడగ్గా, ప్రజలు బాబును నమ్మం అన్న నినాదాలు చేశారు.

tags : jagan, public, belief

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info