A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాగబాబు మళ్లీ ఏమైనా బాంబు పేలుస్తాడా
Share |
January 18 2019, 1:38 pm

ప్రముఖ నటుడు ,జనసేన అదినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గురువారం టిడిపి నేత, ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు బాలకృష్ణపై ఏదైనా తీవ్ర విమర్శ చేయబోతున్నారా?మీడియాలో దీనిపై ఆసక్తికరమైన వార్తలు వస్తున్నాయి.నాగబాబు చేసిన ఒక ప్రకటనలో ఈ విషయం ఉండడంతో ఆయన ఏమి మాట్లాడతారా అన్న ఉత్కంఠ ఏర్పడింది.2011లో చిరంజీవీపై బాలయ్య చేసిన కామెంట్స్‌కు కౌంటర్‌ ఇచ్చి ఈ వివాదానికి ముగింపు పలుకుతానని స్పష్టం చేశారు. అప్పుడే ఇవ్వాలనుకున్నానని, కానీ తమ అన్నయ్య ఆపారన్నారు. తనకేం పబ్లిసిటీ పిచ్చిలేదని, వివాదాలతో పాపులారిటీ కావాలనుకోవడం లేదన్నారు. ఓ ఆర్టిస్ట్‌గా తనకు ఉండాల్సిన గుర్తింపు ఉందని, అంతకు మించి అవసరం లేదన్నారు. తాను ఎప్పుడూ బాలకృష్ణను వ్యక్తిగతంగా విమర్శించలేదని, తన ఫేస్‌బుక్‌ పోస్టుల్లో ఎక్కడా ఆయన పేరు ప్రస్తావించలేదన్నారు. తమపై గతంలో బాలయ్య చేసిన కామెంట్లపై కూడా ఎప్పుడూ రియాక్ట్‌ కాలేదన్నారు. పవన్‌ కల్యాణ్‌పై బాలయ్య వ్యక్తిగతంగా విమర్శలు చేసినా అన్నయ్యగా తాను ఒక్క మాట అనవద్దా? అని ప్రశ్నించారు. బాలయ్య తెలవదు.. పెద్ద బాలయ్య తెలుసని ఒక్క మాటంటే ఇంత వివాదం చేస్తారా? వ్యక్తిగతంగా విమర్శలు చేయాలంటే 100 చేస్తామని, కానీ అలా చేయడం పద్దతి కాదని ఆయన పేర్కొన్నారు.తన పోస్ట్‌ల్లో ఎక్కడా బాలయ్య పేరును ప్రస్తావించలేదని స్పష్టం చేశారు. గుమ్మడికాయల దొంగ ఎవరు? మీరేందుకు తడుముకుంటున్నారని ప్రశ్నించారు.

tags : nagababu, balakrishna

Latest News
*నవయుగ-‘కేబినెట్’నే కదిలిస్తున్న చంద్రబాబు!
*జగన్ కేసు- నిందితుడి అబ్యర్దన
*చంద్రబాబుకు వైసిపి సూటి ప్రశ్న
*సిఎల్పి పదవి ఇవ్వమని అడిగా
*చంద్రబాబు ఎందుకు వణుకుతున్నారు
*మీరెందుకు ఇంకా బిజెపిలో ఉన్నారు
*ఈ చంద్రబాబు మాకొద్దంటున్నారు
*ఎపి డిజిపి నియామకం చెల్లుతుందా
*జగన్ పై దాడి కేసు-మరోసారి బాబు మాట్లాడారు
*ఎపి హైకోర్టులో మూడు దర్మాసనాలు
*జగన్ కేసులో టిడిపి కీలక వ్యక్తి- వాసిరెడ్డి స్టోరీ
*జగన్ కేసు- హర్షవర్దన్ చౌదరి పత్తా లేడు
*ఎన్.టి.ఆర్ సిద్దాంతాన్ని అమలు చేస్తున్నాం-బాబు
*5గురు హీరోయిన్ లపై దుష్ప్రచారం
*చంద్రబాబు ఎదురుదాడికి దిగుతారా
*బాలకృష్ణ,పవన్ లు కేసిఆర్ ను కలవవచ్చా
*ఎన్.టి.ఆర్.సినిమా నష్టాలు ఎవరికి!
*అమరావతిలో ఆ 5 కంపెనీలదే హవా
*జగన్ మరో స్కీమ్ - కాపీ కి చంద్రబాబు రెడీ
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info