A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ప్రజల గుండె చప్పుడు విన్నా..జగన్ పాదయాత్ర ముగింపు
Share |
January 18 2019, 12:49 pm

తాన పాదయాత్రలో తాను ప్రజల గుండె చప్పుడు విన్నానని, దానిని తన గుండె చప్పుడుగా మార్చుకున్నానని విపక్ష నేత, వైఎస్ ఆర్ కాంగ్రెస్ అదినేత జగన్ అన్నారు.భారీ జనసందోహం మద్య ఆయన ఇచ్చాపురం లో ఆయన పాదయాత్ర ముగించారు. ఇడుపుల పాయలో ఆరంభమైనప్పుడు ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నడుస్తానని అనుకోలేదని, నడిచింది తానే అయినా, నడిపించింది ప్రజలు,పైన ఉన్న దేవుడు అని ఆయన అన్నారు. తన తండ్రి ఆశిస్సులు ఉన్నాయని ఆయన అన్నారు.హైదరాబాద్ నుంచి దుబాయికి మూడువేల కిలోమీటర్లు అని, కన్యాకుమారి కశ్మీర్ కు 3440 కిలోమీటర్లు అని కొందరు మిత్రులు చెప్పారని, ఇలాంటి దూరాలను ఎపిలో నడవగలిగామంటే మీ అందరి దీవెనలే ప్రేరణ అని ఆయన అన్నారు. ఇన్ని కీలోమీటర్లు దూరం నడిచామన్నది ముఖ్యం కాదని, ఎంతమంది బరోసా ఇచ్చామన్నది ముఖ్యమని ఆయన అన్నారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలన ఎలా ఉందో కూడా ప్రజలు అడుగడుగునా ప్రజలు వివరించారని ఆయన అన్నారు.చంద్రబాబు అన్ని కులాలను మోసం చేయడానికి పిహెచ్డి చేశారని ఆయన విమర్శించారు.

tags : jagan, public, wling,icchapuram

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info