A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నవీన్ పట్నాయక్ తేల్చేశారు-కూటమికి నో
Share |
January 18 2019, 12:50 pm

జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయతలపెట్టిన మహా కూటమిలో చేరే ఆలోచన లేదని బిజు జనతా దళ్ అధినేత,ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.కాంగ్రెస్ ఆద్వర్యంలోని యుపిఎలోకాని, బిజెపి నేతృత్వంలోని ఎన్.డి.ఎ.లో కాని చేరబోమని ఆయన చెప్పారు.
దేశంలోని రెండు ప్రధాన పార్టీలకు బీజేడీ దూరంగా ఉండి, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. నవీన్ పట్నాయక్ ఒక కార్యక్రమంలో ఈ విషయం వెల్లడించారు. రెండు రోజుల క్రితం మహాకూటమిలో చేరే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఆలోచిస్తున్నామని అన్నారు.తాజాగా వచ్చిన కదనం ప్రకారం కాంగ్రెస్ కూటమిలో చేరడం లేదని తేల్చారు. నవీన్ పట్నయక్ తనతో పాటు యుపిఎలోకి వస్తారని టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు భావించారు.కాని ఇప్పుడు ఆయన సిద్దపడడం లేదు.

tags : naveen patnaik, alliance

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info