A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
బలాలు సరిపోవడం లేదనే రాహుల్,చంద్రబాబు..
Share |
June 17 2019, 3:09 pm

కేంద్రంలో తన బలం సరిపోదని ఎఐసిసి అదినేత రాహుల్ గాందీ పొత్తుల కోసం ప్రయత్నిస్తుంటే, ఎపిలో టిడిపి అదినేత ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన బలం సరిపోవడం లేదని పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని, అందుకే వారిద్దరూ కలుస్తున్నారని టిఆర్ఎస్ కార్యదర్శి గట్టు రామచంద్రరావు ఎద్దేవ చేశారు.జగన్ పాదయాత్ర పూర్తి అవుతున్న సందర్భంగా ఆయన అబినందనలు తెలిపారు. వైఎస్‌ జగన్‌ తొలుత వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి కొడుకుగా గుర్తింపు పొందినప్పటికీ ఆయన ప్రజల మధ్యలోనే ఎదిగారని, ప్రజలలోనే పెరిగారని ఆయన అభిప్రాయడ్డారు. ప్రజలను నమ్ముకున్న ఏ నాయకుడు కూడా నష్టపోడని, ప్రజలు లేకపోతే తానులేనుకునే నాయకుడు జగన్‌ అని ఆయన కొనియాడారు. సొంత పార్టీ పెట్టుకుని ప్రజల అభిమానాలు, ఆదరణను జగన్‌ పొందారని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేన, టీడీపీ కలిస్తే కేవలం 5 లక్షల 40వేల ఓట్లు మాత్రమే వైఎస్సార్‌సీపీ కంటే ఎక్కువగా వచ్చాయని, బీజేపీ లేకపోతే అన్ని ఓట్లు కూడా రావని వెల్లడించారు. కేవలం ఒక్క ఎమ్మెల్యేతో సొంత పార్టీని స్థాపించి నేడు 67 మంది ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది ఎంపీలు సాధించి ఏపీలో బలమైన నేతగా జగన్‌ ఎదిగారని ఆయన పేర్కొన్నారు.ఎన్నికలకు ముందే వైఎస్‌ జగన్‌ ముందు చంద్రబాబు ఓడిపోయారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికలు జగన్‌, ఆయన వ్యతిరేకుల మధ్యనే జరుగుతాయని, భవిష్యత్తులో ఆయనకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నట్లు గట్టు రామచంద్రరావు పేర్కొన్నారు.

tags : gattu, babu

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info