A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
అమరావతి- గ్యాలరీకి 44 కోట్లు!
Share |
January 18 2019, 12:54 pm

అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పేరుతో వెల్‌కమ్‌ గ్యాలరీ అంటూ కొత్త ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేయడానికి ఎపి ప్రభుత్వం పూనుకుంది. ఈ ప్దర్శనకు నలభైనాలుగు కోట్లు ఖర్చు చేయబోతున్నారని కదనం. ఈ వెల్‌కమ్‌ గ్యాలరీ నిర్మాణానికి సింగపూర్‌ మంత్రి ఈశ్వరన్, ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం శ్రీకారం చుట్టనున్నారు. వెల్‌కమ్‌ గ్యాలరీ అంటే సెట్టింగ్‌లతో రాజధాని ఊహాచిత్రాన్ని చూపించడమే తప్ప మరొకటి కాదని ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఎన్నికల ముందు మూడు నెలల్లోగా ఈ సెట్టింగ్‌లతో కూడిన రాజధాని ఊహాచిత్రాన్ని రూపొందించాలని నిర్ణయించారు. దీనిద్వారా రాజధానిలో ఏదో అద్భుతం జరగిబోతోందని ప్రజల్లో భ్రమలు కల్పించడమే ప్రభుత్వ ఉద్దేశమని అధికారులు అంటున్నారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల బొమ్మలు, చిత్రాలను వెల్‌కమ్‌ గ్యాలరీలో ప్రదర్శించనున్నారు. రెండు హెక్టార్లలో 4,000 చదరపు మీటర్లలో వెల్‌కమ్‌ గ్యాలరీని నిర్మించనున్నారు. ఇందుకోసం ఇటీవల సింగపూర్‌లో జరిగిన అమరావతి డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సమావేశంలో కన్సల్టెన్సీని ఎంపిక చేశారు. గ్యాలరీ డిజైన్‌ రూపకల్పన కోసం వీటీపీ కాస్ట్‌ అడ్వయిజరీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అనే సంస్థను ఎంపిక చేశారు. కన్సల్టెన్సీ ఫీజుగా ప్రాజెక్టు వ్యయంలో 0.95 శాతం ఇవ్వాలని నిర్ణయించారు. అంటే కన్సల్టెన్సీ ఫీజు కింద రూ.42.48 లక్షలు ఇస్తారు. వెల్‌కమ్‌ గ్యాలరీ సెట్టింగ్‌ల నిర్మాణ వ్యయం రూ.44.50 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

tags : amaravati gallary

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info