A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
రిజర్వేషన్లు బిల్లు-కాంగ్రెస్ భయపడింది
Share |
January 18 2019, 12:56 pm

అగ్రవర్ణాలకు రిజర్వేషన్లు ఇచ్చే బిల్లుపై పలు రకాల విమర్శలు చేసిన కాంగ్రస్ పార్టీ,మరికొన్ని పార్టీలు భయపడ్డాయి. అంతిమంగా దాదాపు అన్ని పార్టీలు బిల్లుకు మద్దతు ఇచ్చాయి.ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.కాని చివరికి మద్దతు ఇవ్వక తప్పలేదు.సున్నితమైన ఈ అంశంలో అగ్రవర్ణాల మద్దతు కోల్పోతామని ఆయా పార్టీలు భయపడ్డాయి.దాంతో బిజెపి బిల్లుకు మద్దతు ఇచ్చాయి. ఓటింగ్‌కు అనుకూలంగా 323 ఓట్లు వచ్చాయి. వ్యతిరేకంగా 3 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో సభలో 326 మంది ఉన్నారు. అంతకు ముందు నాలుగున్నర గంటలపాటు చర్చ జరిగింది.మూడింట రెండు వంతుల మెజార్టీకన్నా ఎక్కవ ఓట్లే వచ్చాయి. దాదాపు అన్ని పార్టీలూ బిల్లుకు మద్దతిచ్చాయి. బిల్లుపై రాజ్యసభలో బుధవారం చర్చ జరగనుంది. రాజ్యసభలో ఆమోదం పొందాక రాష్ట్రపతి సంతకం కోసం పంపిస్తారు. ఆ తర్వాత ఇది అమల్లోకి వస్తుంది.

tags : congress, reservations

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info