A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపికి కెసిఆర్ వల్లా నష్టం- వైసిపి
Share |
March 22 2019, 1:53 pm

వైఎస్ ఆర్ కాంగ్రెస్ రెండు పడవలపై కాళ్లు వేయదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ తమకు కెసిఆర్ కు సంబందం అంటగడుతూ ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ఎద్దేవ చేశారు. ఇంతకాలం కెసిఆర్ చుట్టూ తిరిగింది ఎవరని ప్రశ్నించారు. అనంతపురానికి మంత్రి ఇంటిలో పెళ్లికి వెళితే కెసిఆర్ కు స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారని ,కెసిఆర్ యాగానికి పిలిస్తే వెళ్లింది చంద్రబాబు అని ఆయన అన్నారు. కెసిఆర్ తో పొత్తుకు ప్రయత్నం చేశామని స్వయంగా చెప్పింది చంద్రబాబేనని అన్నారు. అన్నీచేసి ఇప్పుడు తమకు సంబందం పెట్టి తప్పుడు ప్రచారం చేయాలని చూస్తారా అని ఆయన అన్నారు. ఎపిని చంద్రబాబు బ్రష్టు పట్టించారని, కెసిఆర్ వల్ల కూడా ఎపికి నష్టం జరిగిందని ఆయన అన్నారు.ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పట్టుబడితే అతనిని శిక్షించకుండా రాజీపడి కెసిఆర్ ఎపికి తీరని నష్టం చేశారని ఆయన అన్నారు.అందువల్లే చంద్రబాబు ఎపిని దోచుకునే అవకాశం తీసుకున్నారని బొత్స విమర్శించారు.తాము ఎపికి పరిమితం అవుతామని ఎప్పుడో ప్రకటించడం జరిగిందని అన్నారు.ఒంటరిగానే వచ్చే ఎన్నికలలో పోటీచేస్తామని ఆయన స్పష్టం చేశారు.

tags : botsa, ap, kcr

Latest News
*చంద్రబాబు పార్టనర్ ...అంటూ పవన్ పై ...
*పులివెందుల గడ్డ--జగన్ ఉద్వేగ భరిత స్పీచ్
*మోహన్ భాబు ధర్నా
*పవన్ ఆషామాషీగా పార్టీ పెట్టారా-చంద్రబాబు
*ఈ ఇరవై రోజుల్లో మరిన్ని కుట్రలు చేస్తారు
*చంద్రబాబుకు నా ఇంగ్లీష్ అర్దం కాలేదేమో
*డికె. అరుణకు ప్రాదాన్యం
*టివీలు చూడడం,..సెల్ వాడడం..చంద్రబాబు స్పీచ్
*నాగబాబుకు వ్యతిరేకంగా శివాజీ రాజా ప్రచారం
*మంత్రి తలసాని కుమారుడికి టిక్కెట్
*పవన్ కళ్యాణ్ ఆస్తి,అప్పుల వివరాలు
*చంద్రబాబు ఇలా చేయబోతున్నారు..జగన్ వెల్లడి
*చంద్రబాబు నాటకాలు ఇష్టం లేదు- మోహన్ బాబు
*కెసిఆర్ ఎదుగుదల-బాబుపాత్ర- విశ్లేషణ
*లోకేష్ ఎలా నటించుకుంటూ వెళ్లారంటే..
*చంద్రబాబు సామాజికవర్గానికే ప్రాధాన్యత
*మహిళలకు స్మార్ట్ పోన్ లిస్తా..చంద్రబాబు
*సిపిఐ మద్దతు కోసం కాంగ్రెస్ యత్నం
*చంద్రబాబు ఓటమిని అంగీకరిస్తున్నారా
*వివేక్ అవుట్ ...కొత్త అభ్యర్ధికి టిక్కెట్
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info