A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ముస్లింలలో చీలిక తేవడానికి బాబు యత్నం
Share |
January 18 2019, 12:37 pm

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ముస్లింలలో ఐక్యతను చెడగొట్టడానికి టిడిపి అదినేత చంద్రబాబు నాయుడు ప్రయత్నించారని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయన ఒక సబలో మాట్లాడుతూ ఈ ఆరోపణ చేశారు. తాను కూడా ఎపికి వచ్చి తన మిత్రుడు జగన్ కు అనుకూలంగా ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.తన తడాఖా చూపిస్తానని కూడా ఆయన చెప్పారు.బీజేపీ ‘సీ’టీంగా, మోదీ టీంగా మజ్లిస్‌ పార్టీని అభివర్ణించిన చంద్రబాబుకు తగిన గుణపాఠం తప్పదన్నారు. వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డి తనకు మంచి మిత్రుడని, ఆయన పక్షాన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని తెలిపారు. సొంత రాష్ట్రంలోనే బాబుకు వ్యతిరేకత ఉందని, ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో రెండు స్థానాలను కూడా టీడీపీ గెలుచుకోలేదని ఒవైసీ జోస్యం చెప్పారు. తెలంగాణ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రచారం చేసినా టీడీపీ కనీసం ఉనికి చాటలేకపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ, మహాకూటమికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని విమర్శించారు.

tags : asad, muslims, chandrababu

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info