A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
నాయిని మంత్రి అవుతారా?ఏ శాఖ ఇస్తారో
Share |
January 18 2019, 12:39 pm

తెలంగాణ కొత్త హోం మంత్రిగా మహమూద్ అలీ నియమితులు అవడం విశేషం. ముఖ్యమంత్రి కెసిఆర్ తో పాటు ఆయన కూడా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు నాయిని నరసింహారెడ్డి హోం మంత్రిగా ఉన్నారు. గత టరమ్ లో ఆయన శాఖ మారుతుందని ప్రచారం జరిగినా, కెసిఆర్ చివరి వరకు నాయినినే హోం మంత్రిగా కొనసాగించారు. ఇప్పుడు మరో సారి అవకాశం వస్తుందా?రాదా అన్న దానికి ఆస్కారం లేకుండా హోం శాఖను మహమూద్ అలీకి కేటాయించడం విశేషం.గత ఎన్నికలలో ముషీరాబాద్ టిక్కెట్ కోసం నాయిని గట్టి ప్రయత్నం చేశారు.ఆ సందర్భంగా కెసిఆర్ ఆయనను బుజ్జగించవలసి వచ్చింది. ఇప్పుడు నాయినికి మంత్రి పదవి వస్తుందా.మరో శాఖ ఇస్తారా?లేదా అన్నది చర్చనీయాంశంగా ఉంది.

tags : nayini, home minister

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info