A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఎపిలో ఇళ్ల నిర్మాణానికి 14వేల కోట్లు -కేంద్రం
Share |
January 18 2019, 12:40 pm

ఎపికి కేంద్రం ఒక్క పైసా ఇవ్వలేదని రోజూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తుంటారు.మరో వైపు పార్లమెంటులో ఏ కార్యక్రమం కింద ఎపికి ఎంత డబ్బు ఇచ్చింది కేంద్రం ప్రకటనలు చేస్తోంది. తాజాగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన(పట్టణం) పథకం కింద ఇళ్ల నిర్మాణానికి ఏపీపి రూ.3,627 కోట్లు విడుదల చేశామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరి తెలిపారు. రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు గురువారం ఆయన జవాబు ఇచ్చారు. ఏపీలో 13.78 లక్షల ఇళ్ల నిర్మాణం అవసరమని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. అయితే, రూ.14,414.72 కోట్లతో 9,59,847 ఇళ్ల నిర్మాణానికి ఆమోదం లభించిందని ఆయన అన్నారు. అయితే రూ.2,788.82 కోట్లకే రాష్ట్ర ప్రభుత్వం యూసీలు ఇచ్చిందన్నారు. ఇవి కాకుండా మరో 5,298 ఇళ్ల నిర్మాణానికి క్రెడిట్‌ లింక్డ్‌ సబ్సిడీ పథకం కింద మరో రూ.133.22 కోట్లు విడుదల చేశామని మంత్రి వివరించారు.

tags : ap, center

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info