A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఖమ్మం జిల్లాలో టిఆర్ఎస్ కు ఎదురు దెబ్బ
Share |
June 16 2019, 2:27 am

తెలంగాణ అంతటా టిఆర్ఎస్ పవనాలు వీచినా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం పూర్తిగా ఎదురు దెబ్బతింది. ఇందుకు అంతర్గత విభేదాలు కూడా కారణమని అంటున్నారు. స్వయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావే ఓటమి చెందడం అందరిని ఆశ్చర్యపరచింది.ఒక్క ఖమ్మం నియోజకవర్గంలోనే టిఆర్ఎస్ అభ్యర్ధి పువ్వాడ అజయ్ కుమార్ గెలవగలిగారు.
జిల్లాలోని పది స్థానాలకుగాను 6 స్థానాలలో కాంగ్రెస్‌ విజయం సాదించింది. 2014లో గెలిచిన కొత్తగూడెం స్థానాన్ని కూడా టీఆర్‌ఎస్‌ కోల్సోయింది. మదిర (మల్లుభట్టివిక్రమార్క), పినపాక (రేగకాంతారావు), ఇల్లందు శ్రీమతి బానోతు హరిప్రియా నాయక్), పాలేరు (కె ఉపేందర్ రెడ్డి), కొత్తగూడెం (వనమా వెంకటేశ్వరరావు), భధ్రాచలం (పోడెం వీరయ్య) లలో తన సత్తా చాటింది. ఆశ్వారావ్‌పేట (మచ్చా నాగేశ్వరరావు), సత్తుపల్లి (సండ్రవెంకట వీరయ్య) లలో టీడీపీ గెలవగా, ఖమ్మం (పువ్వాడ అజయ్)లో టీఆర్‌ఎస్‌ అభ్యర్ధి , వైరా (రాముల్‌నాయక్‌)లో స్వతంత్ర అభ్యర్ధి గెలుపొందారు.

tags : trs, khammam

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info