A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ ఎన్నికలు-జగన్ రియాక్షన్
Share |
June 17 2019, 2:33 pm

టిడిపి, కాంగ్రెస్ కు కలిపి గత ఎన్నికల ఆదారంగా చూస్తే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వస్తే, టిఆర్ఎస్ కు 34 శాతం మాత్రమే వచ్చాయని, కాని కాంగ్రెస్ ,టిడిపి పొత్తు తర్వాత మొత్తం ఓట్లు పోయాయని, అనైతిక పొత్తును ప్రజలు తిరస్కరించారని విపక్ష నేత జగన్ అన్నారు. ఇదే కాంగ్రెస్,టిడిపిలు ఆడిన జిమ్మిక్కులు గమనించండి. రాహుల్, చంద్రబాబు పక్కపక్కన కనిపించారు. జూన్ రెండున కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు పాలనపై పుస్తకం విడుదల చేసింది. చార్జీషీట్ అని రాహుల్ పోటో వేసిన కాంగ్రెస్ పార్టీ ,ఇప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని దారుణంగా దెబ్బతిన్నారని ఆయన అన్నారు .రాహుల్, చంద్రబాబు చెట్టాపట్టాలు వేసుకుంటే ప్రజలు ఎలా నమ్ముతారు అని అడుగుతున్నానని అన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికలలో పొత్తు పెట్టుకోకముందు, నందమూరి హరికృష్ణ చనిపోయినప్పుడు , ఆయన బౌతిక కాయం సాక్షిగా, కెటిఆర్ తో టిఆర్ఎస్ తో పొత్తుల కోసం బేరమాడారని, కాని వారు అంగీకరించలేదని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఎంత సిగ్గు లేని వాడంటే, అసెంబ్లీ కి వెళ్లి టిఆర్ఎస్ పొత్తు ను మోడీ అడ్డుకున్నాడని చెప్పారని అన్నారు.ఆ మాట తర్వాత కాంగ్రెస్ తో సిగ్గు లేకుండా జట్టు కట్టాడని అన్నారు. ఇదే చంద్రబాబు కాంగ్రెస్ ను అంతకుముందు రాష్ట్రాన్ని విడదీసింది..పొట్టకొట్టిందని,దీనిని బతకనివ్వకూడదు అన్నాడు. ఇలాంటి పార్టీని నమ్మి ఎవరు ఓటు వేస్తారు?అని జగన్ ప్రశ్నించారు.

tags : jagan, elections, reaction, jgan

Latest News
*జగన్ అలా చేయడం నచ్చిందన్న జెసి
*కాళేశ్వరంపై మీ వైఖరి ఏమిటి?టిడిపి ప్రశ్న
*ఐదేళ్లలో చాలా అభివృద్ది చేశాం-అచ్చెన్న వాదన
*రజనీకాంత్ తో పొత్తు కోసం బిజెపి ప్రయత్నాలు
*టిడిపి హయాంలో దౌర్బాగ్య పాలన సాగింది
*నేడు సచివాలయ భవనాల అప్పగింత
*టిఆర్ఎస్ బిజెపి ప్రత్యామ్నాయమా-భ్రమ
*ఎటిఎమ్ లు ఇలా ఏర్పాటు చేయాలి
*విభజన హామీలు అమలుచేయాలని కోరాం
*కాంగ్రెస్ కు పెద్ద చికిత్స అవసరం
*వాళ్లను జంతువుల్లా చూస్తారా-హైకోర్టు ఆగ్రహం
*అచ్చెన్నాయుడు పొరపాటున గెలిచారు
*రాజదానికి వచ్చామంటే..అచ్చెన్నాయుడు
*టిడిపి నేతల గుట్టు విప్పిన కాకాణి
*ప్రజలు ఛీకొట్టినా ఇంకా సి.ఎమ్. అనుకుంటున్నారు
*ఎయిర్ పోర్టులో చంద్రబాబు తనిఖీలు కరెక్టే-ఐజి
*చంద్రబాబుకు ఓటమి కారణాలు తెలియడం లేదా
*డాలస్ లో అన్నదాత సుఖీభవ !
*రైళ్లలో మసాజ్ సేవలా...తూచ్
*ప్రభుత్వ,ప్రైవేటు ఆస్పత్రులలో ఒపి సేవలు బంద్
*బిజెపి మైండ్ గేమ్ ఆరంబించిందా
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info