A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
ఆంద్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు-వైసిపి
Share |
January 18 2019, 1:08 pm

ఎపి ప్రజలు ఎప్పుడు చంద్రబాబును గద్దె దించాలా అన్న టైమ్ కోసం ఎదురు చూస్తున్నారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఆ పార్టీ రాజకీయ వ్యవహరాల కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న సీమాంద్ర ప్రజలంతా చంద్రబాబుకుగట్టి గుణపాఠం చెప్పారని ఆయన అన్నారు. హైదరాబాద్ అంతా తానే అభివృద్ది చేశానని, దానిని నిర్మించానంంటూ అబద్దాలు ప్రచారం చేశారని,కాని ప్రజలు వాటిని నమ్మకుండా టిడిపి,కాంగ్రెస్ కూటమిని ఓడించారని ఆయన అన్నారు. చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్ మునిగిందని ఆయన అన్నారు.తెలంగాణలో టిడిపి ,చంద్రబాబు ఓటమి తో ఆంద్ర ప్రజలంతా సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు.మీడియా, మనీ,మానిప్యులేషన్ తో గెలవాలన్న ఆయన కుతంత్రాలకు ప్రజలు కళ్లెం వేశారని సజ్జల అన్నారు.

tags : sajjala, ap, public

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info