A News Website
ksr
Home Books About US Contact US
 
 
 
 
 
తెలంగాణ టిఆర్ఎస్ దే..ప్రజా కూటమికి ఎదురు దెబ్బ
Share |
January 18 2019, 1:10 pm

తెలంగాణలో టిఆర్ఎస్ పూర్తి ఆదిక్యతను ప్రదర్శిస్తోంది. ప్రజా కూటమి ఎలాగైనా అదికారంలోకి రావాలన్న ప్రయత్నం చేసినా, వారి కోరిక ఫలించలేదు. తొలి ఫలితాల ప్రకారం టిఆర్ఎస్ కు డెబ్బై స్థానాలుపైనే వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.అన్నీ టీవీలలో వస్తున్న సమాచారం ప్రకారం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం అనిపిస్తుంది. ప్రత్యేకించి ప్రముఖ కాంగ్రెస్ నతలు జానారెడ్డి, రేవంత్ రెడ్డి, మల్లు భట్టి ,జీవన్ రెడ్డి తదితరులు వెనుకంజలో ఉన్నారు. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ,మరికొందరు లీడ్ లో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో టిఆర్స్ ఆదిక్యతలో ఉంది. ఇండిపెండెంట్ గెలుస్తారని భావించిన మక్తల్ లో కూడా టిఆర్ఎస్ మెజార్టీలో ఉండడం విశేషం.

tags : telangana, trs,

Latest News
 
 
 
 
 
 
 
 
   
     

 
 
Privacy Policy | copyright © 2011 www.kommineni.info